జగన్మోహన్ రెడీ బెంగళూరులో ఉన్నా సరే ఏపీ ఆర్థిక పరిస్థితిపై కంగారు పడిపోతున్నారు. డీప్‌గా ఎనాలసిస్ చేసి.. ప్రతి నెలా రోజు ఇంగ్లిష్ లో పెద్ద ట్వీట్ వేసేస్తూంటారు. ఈ సారి ఆరు నెలల లెక్కలు వేశారు. రియల్ గా .. కాగ్ ఏం విడుదల చేసిందో అది పెడితే అసలు విషయాలు తెలుస్తాయి. కానీ అసలు వాటిని పక్కన పెట్టి తాను సాక్షి ఆఫీసులో తయారు చేయించిన గ్రాఫిక్స్ తో ఎవరికీ అర్థం కాని పర్సంటేజీలు, సీఏజీఆర్ అంటూ కలగాపులగం లెక్కలు చెప్పి.. గుండెలు బాదేసుకుంటున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర సొంత పన్ను ఆదాయం వృద్ధి కేవలం 7.03 శాతం మాత్రమేనని చెప్పుక౧చ్చారు. జీఎస్టీ, , అమ్మకపు పన్ను కేవలం 2.85 శాతం మాత్రమే పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇవి కాగ్ చెప్పిందన్నారు. గానీ దేశంలో అత్యధిక జీఎస్టీ పెరుగుదల ఉన్న రాష్ట్రాల్లో ఒకటి ఏపీ అని జీఎస్టీ ప్రతి నెలా నివేదికల్లో చెబుతోంది. మరి జగన్ కు ఈ రెండు శాతం లెక్కలు ఎక్కడ దొరికాయో ? సీఏజీఆర్ అంటే సంయుక్త వార్షిక వృద్ధి రేటు కూడా 2.75 శాతం మాత్రమే అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నిపుణలకు కూడా అర్థం కాని లెక్కలేసి.. రెండు శాతం, మూడు శాతం పెరుగుతోందని ఏవేవో విభాగాల్లో చెబుతున్నారు. కానీ వాటికి ఆధారాలేమిటో బయట పెట్టడం లేదు. ఏపీ పన్ను వసూళ్లలో పది శాతానికిపైగా వృద్ధిరేటు సాధిస్తోంది. పెట్టుబడుల సాధనలో దేశంలోనే టాప్ ఫైవ్ కు చేరుకుంది. అయినా జగన్ రెడ్డి ఆర్థిక పరిస్థితి గురించి ఏడుస్తున్నారు. నిజానికి జగన్ రెడ్డి చేసి పోయిన ఐదు సంవత్సల విధ్వంసాన్ని గాడిన పెట్టడం అంత సులువు కాదు.
జగన్ నిజంగా ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేయాలనుకుంటే.. ఆర్బీఐ రిలీజ్ చేసే డాక్యుమెంట్లను పోస్టు చేయాలి కానీ.. సాక్షి ఆఫీసులో తయారు చేసే గ్రాఫిక్స్ కాదు. నిజమైనవి పెడితే.. నిజమేంటో తెలిసిపోతుందని తనకు మాత్రమే అర్థమయ్యే పర్సంటేజీలతో ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేస్తున్నారు.

