వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలోని తన నివాసంలో మీడియా ముందుకు రానున్నారు. ఇటీవల ముగిసిన వేసవి సెలవులను యూరప్ పర్యటనలో కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఆయన పది రోజుల కిందటే బెంగళూరుకు చేరుకున్నారు. అయితే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి మాత్రం ఈ వారమే వచ్చారు.
సాధారణంగా జగన్ మీడియా ముందుకు వస్తే సుదీర్ఘంగా గంటల తరబడి మాట్లాడటం ఆయన శైలి. అయితే, గతంలో ఆయన నిర్వహించిన కొన్ని ప్రెస్మీట్లలోని ప్రసంగాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఈసారి కూడా సుమారు రెండు మూడు గంటల పాటు సాగే అవకాశం ఉన్న ఈ భేటీలో, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఆయన మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, నెటిజన్లు ,ప్రతిపక్ష సోషల్ మీడియా విభాగాలు మాత్రం ఈ ప్రెస్‌మీట్ నుంచి వచ్చే స్టఫ్ కోసం అప్పుడే ట్రోలింగ్ మీటర్లను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఇలాంటి సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం మినహా ఏమీ చేయడం లేదు. ఆయన బయటకు రాకపోవడంతో వైసీపీ క్యాడర్లో నైరాశ్యం ఆవరించింది. అసెంబ్లీకి వెళ్లి చర్చించాల్సిన అంశాలనుకూడా ఆయన తన వాదన ప్రెస్‌మీట్ లో వినిపించి అ వెళ్లిపోతున్నారు. తాను ఇంత కంటే ఏమీ చేయలేనని బహిరంగంగానే చెబుతూంటారు.
