వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రెస్‌మీట్ పెట్టారు. గంటల తరబడి సుదీర్ఘం ..చూసి చదువుతూ తన హావభావాలు చూపించేందుకు తంటాలు పడ్డారు. అసలు ఆయన ఏ టాపిక్ చెప్పాలనుకున్నారో.. ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టాలనుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఏ రాజకీయనాయకుడు అయినా ఓ నిర్దిష్ట అంశంపై మాట్లాడేందుకు ప్రెస్‌మీట్ పెట్టి తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. కానీ జగన్ రెడ్డి రూటే వేరు.ఆయన చెప్పిందే చెబుతారు. గత ప్రెస్మీట్లలో చెప్పిందే చెబుతారు. చివరికి ఆయన ఏదైనా కొత్త పాయింట్ చెబితే ఎవరూ పట్టించుకోరు.
జగన్ రెడ్డి తాను ఏపీకి వచ్చానని చెప్పుకునేందకన్నట్లుగా ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయన డేటా సెంటర్ పై స్పందించాలనుకున్నారు. చంద్రబాబు క్రెడిట్ లేదని..తనదేనని చెప్పుకోవాలనుకున్నారు. దాన్ని చెప్పుకోవడానికి ఎఫెక్టివ్ గా ఓ అరగంటలో చెప్పేస్తే.. ఆయన మాటలు ప్రజల్లోకి వెళ్లేవి. కానీ ఎప్పటిలా సోది అంతా చెప్పి మధ్యలో ఆ టాపిక్ వద్దకు వెళ్లే సరికి అందరూ ఆయన ప్రెస్ మీట్ ను పట్టించుకోవడం మానేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని చివరికి బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ తాగి వచ్చారో లేదో జగన్ ఏమైనా వాసన చూశారా అని నెటిజన్లు అడుగుతున్నారు. పోనీ ఆయన పార్టీ సభ్యులు ఎవరైనా వాసన చూశారా అంటే..ఎవరూ అసెంబ్లీలోలేరు. మరి ఎందుకు ఆయన మాట్లాడటం?. పైగా ఈ టాపిక్ ముగిసిపోయి చాలా కాలం అయింది. జగన్ రెడ్డి స్ట్రాటజిస్టుల మాట వింటారో లేదో..ప్రతీ సారి ఇలా ఆవు వ్యాసాలతో ప్రెస్మీట్లు పెట్టి అందరికీ విసుగు పుట్టించడం తప్ప.. ప్రజల్లోకి తన వాదన వెళ్లే అవకాశమే ఉండదు. అసెంబ్లీకి కూడా వెళ్లని ఆయన ప్రెస్మీట్లను ఇలా బోర్ క్లాస్‌గా మారిస్తే.. ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు.