రాజకీయ నాయకులకు ప్రజలంటే భయం.. దేశమంటే భక్తి ఉండాలి. పదవి ఉంటేనే అవి ఉన్నట్లుగా నటిస్తామని .. అది లేకపోతే అసలు పట్టించుకోమని అనుకునే నేతలు కూడా ఉంటారు. అలాంటి నేత జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి పోయాక జగన్ జాతీయ జెండాను ఎగురవేసిన సందర్భమే లేదు. ఆయనకు దేశంపై భక్తి లేదు. రాజ్యాంగాన్ని గౌరవించరు..ప్రజల్ని అసలు లెక్కచేయరు.. ఇలాంటిరాజకీయ నేత దేశ రాజకీయాల్లో అరుదు. దేశం పట్ల..రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం, బాధ్యత లేని ఇలాంటి వారు రాజకీయాల్లో మనగలగడం ఆశ్చర్యమే. అదే ప్రజాస్వామ్యగొప్పదనం అనుకోవాలా.. లోపంఅనుకోవాలా?
రిపబ్లిక్ డే రోజు కనిపించని జగన్
రాజ్యాంగం కల్పించిన పదవులను అనుభవించే వారు, అదే రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం కనీస ధర్మం. కానీ జగన్ రెడ్డికి అదేమీ లేదు. ఆయనకు వ్యవస్థలన్నా, ప్రజాస్వామ్య సంప్రదాయాలన్నా ఏమాత్రం లెక్కలేదని మరోసారి నిరూపితం అయింది. జాతీయ జెండా ఆవిష్కరణ వంటి కనీస బాధ్యతలను విస్మరించడం ఆయన దేశభక్తిని, బాధ్యతారాహిత్యాన్ని బట్టబయలు చేసిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండా ఎగురవేయలేదు. కనీసం బెంగళూరు ఇంట్లో ఆయన ఆ పని చేయలేదు. చేసి ఉంటే సోషల్ మీడియా టీం జగనన్న దేశభక్తి గురించి పాటలు పాడేది. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం నాడూ పట్టించుకోలేదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తించడం పరిణతి చెందిన రాజకీయ లక్షణం అనిపించుకోదు. రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వహించిన వ్యక్తికి, ఆ రాజ్యాంగం పట్ల, దేశ చిహ్నాల పట్ల ఉండాల్సిన గౌరవం నిరంతరం కొనసాగాలి. కానీ జగన్ విషయంలో జాతీయ జెండా ఎగురవేసే సందర్భాలను కూడా పక్కన పెట్టడం చూస్తుంటే, ఆయనకు కేవలం అధికారంపైనే మక్కువ తప్ప, దేశ గౌరవంపై కాదు. ఇలాంటి ధోరణి ఆరోగ్యకరమైన రాజకీయాలకు గొడ్డలిపెట్టు వంటిది.
దేశంపై భక్తి.. ప్రజలంటే భయం ఉండాలి !
రిపబ్లిక్ డే అంటే ఏమిటో కూడా జగన్కు తెలియదు. ఆ విషయం ఆయన ఓ సారి రిపబ్లిక్ డే అంటే అంటూచేసిన ప్రసంగంలోనే తేలిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ సారి జాతీయ గీతాన్నే పాడలేకపోయారు. అలా అవమానించినందుకు ఆయనపై కేసు కూడా నమోదు అయింది. ఇలాంటినేత జగన్.. ప్రజా తీర్పును గౌరవించలేని స్థితిలో ఉన్నారు. ప్రజలే ప్రభువులని భావించే ప్రజాస్వామ్యంలో, ప్రజల తీర్పును గౌరవించి పరాజయాన్ని హుందాగా స్వీకరించడం ఒక ఎత్తు. కానీ, ప్రజల పట్ల కనీస భయం లేకుండా, తన పంథానే సరైనదని భావించే అహంకారపూరిత ధోరణి జగన్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూడటం, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం ఆయన రాజకీయ శైలిలో భాగమైపోయాయి. ఇంతటి బాధ్యతారాహిత్యం ఉన్న నేతలు రాజకీయాల్లో కొనసాగడం అరుదైన విషయమే కాదు, విచారకరమైన విషయం కూడా.
అసెంబ్లీకి హాజరు కాకుండా రాజ్యాంగానికి అగౌరవం
ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి హాజరయ్యేది లేదని ఆయన ప్రకటించడం రాజ్యాంగాన్ని అవమానించడమే. తానే కాదు.. తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలెవరూ హాజరు కాకుండా చేయడం ఆయనకు రాజ్యాంగపట్ల ఎలాంటి నమ్మకం లేదని చెప్పడానికి నిదర్శనం. దేశం పట్ల భక్తి, శాసనాల పట్ల గౌరవం లేని వారు కూడా రాజకీయాల్లో నెట్టుకురాగలుగుతున్నారంటే, అది ప్రజాస్వామ్యం ఇచ్చిన గొప్పదనమా లేక మన వ్యవస్థలోని లోపమా అని ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఇలాంటి వారిని ప్రశ్నించకపోతే, భవిష్యత్తులో రాజకీయ విలువలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. బాధ్యత లేని నాయకత్వం దేశ ప్రగతికి ఎప్పుడూ ఆటంకమే.
