బీజేపీకి రాజ్యసభ సీటు ఆఫర్ ఇస్తున్న జగన్ రెడ్డి !

రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. వైసీపీ మూడు సీట్లు గెలవగలదు. కానీ ఎమ్మెల్యేలందరూ ఓట్లు వేస్తేనే కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. 70 మంది ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. నాలుగు జాబితాల్లో ప్రకటించిన.. బదిలీ చేసిన.. టిక్కెట్ నిరాకరించిన వారు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. దళిత ఎమ్మెల్యేలను ఎక్కువగా బలి చేయడంతో వారు గుర్రుగా ఉన్నారు. నిజానికి మరో వంద నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పుపై కసరత్తు జరుగుతోంది. అధికారిక ప్రకటన ఆపేశారు. రాజ్యసభ ఎన్నికల వ్యవహారం తేలిన తర్వాత మిగతా ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

ఇక్కడే జగన్ రెడ్డి అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. మూడో ఓడిపోయే సీటు బీజేపీకి ఇచ్చేందుకు ప్రతిపాదించబోతున్నారు. ఈ ఆఫర్ ను స్వయంగా ఇచ్చేందుకు జగన్ రెడ్డి బీజేపీ పెద్దల వద్దకు వెళ్తున్నట్లుగా చెబుతున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఖరారు కాగానే జగన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. అక్కడ బీజేపీ నేతలతో చర్చలు జరిపి వారికి కావాల్సిన వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తామని బేరమాడతారని అంటున్నారు.

జగన్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు వచ్చి ఎన్ని విమర్శలు చేసినా వారిని ఏమీ అనరు. కానీ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారిని మాత్రం విమర్శిస్తూంటారు. ఇటీవల తన సభ వద్ద బీజేపీ నేతల కటౌట్ కూడా పెట్టింటి పార్టీ నేతలతో తన్నించారు. అయితే ఆ కటౌట్ కు ఎవరి పోలికలు లేకుండా జాగ్రత్తపడ్డారు. కానీ కమలం గుర్తు వేశారు. ముందొక వ్యవహారం.. వెనుకొక వ్యవహారం జగన్ రెడ్డి నడుపుతున్నారని ఈ అంశంపై బీజేపీ నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా...

28న తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన సమరభేరీ !

తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం...

బుర్రా బ్యాన‌ర్… ‘ఎస్‌.ఎం.ఎస్‌’

స్టార్ రైట‌ర్‌.. బుర్రా సాయిమాధ‌వ్ నిర్మాత‌గా మారారు. ఆయ‌న ఎస్‌.ఎం.ఎస్ అనే నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించారు. అంటే.. సాయిమాధ‌వ్ స్క్రిప్ట్స్ అని అర్థం. తొలి ప్ర‌య‌త్నంగా ఈటీవీ విన్‌తో క‌లిసి ఓ సినిమాని...

తిరుమల శ్రీవారి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు : రమణ దీక్షితులు

గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై రమణదీక్షితులు చేసిన ఆరోపణల గురించి చెప్పాల్సిన పని లేదు. వాటిని పట్టుకుని వైసీపీ నేతలు చేసిన ఆరోపణలూ శృతి మించాయి. చివరికి టీటీడీ పరువు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close