తన ఇంటికి ఖర్చు పెట్టిన ప్రజాధనం రూ. 15 కోట్లు జగన్ తిరిగిస్తున్నారా..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఇళ్లలో ఖర్చు చేయడానికి మంజూరు చేయించుకున్న రూ. మూడు కోట్లను.. వద్దని చెప్పేశారు. ఆ ఉత్తర్వులు రద్దు చేయమని సంబంధిత శాఖ అధికారుల్ని ఆదేశించారు. రోడ్లు, భవనాల శాఖ ఖాతాలో ఈ మూడు కోట్ల ఖర్చును… వేస్తూ.. గతంలో జారీ చేసిన ఉత్తర్వులును తాజాగా ఉపసంహరించారు. ఎందుకు ఉపసంహరిస్తున్నారో కారణాలు మాత్రం చెప్పలేదు. తాడేపల్లిలోని జగన్ ఇల్లు, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ఇంటికి నిర్వహణ, ఇతర ఖర్చులకంటూ.. కొద్ది రోజుల కిందట.. రూ. రెండు కోట్ల 87 లక్షలు మంజూరు చేస్తూ.. జీవో జారీ అయింది. దీనిపై.. తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ప్రజల సొమ్మును జగన్ .. తన సొంత అవసరాలకు వాడుకుంటున్నారని.. ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. సోషల్ మీడియాలో సామాన్య జనం కూడా ఇదే చోద్యం అని ప్రశ్నించడం ప్రారంభించారు.

ఏమయిందో ఏమో కానీ.. హఠాత్తుగా.. అటూ.. ఇటూగా.. ఉన్న ఆ మూడు కోట్ల మొత్తం… వద్దని.. రద్దు ఉత్తర్వులు జారీ చేయించేశారు. తెర వెనుక ఏం జరిగిందో కానీ.. ఇలా కేటాయింపులు ఉపసంహరించుకోవడంతో.. కొత్త చర్చ ప్రారంభమయింది. ఆరు నెలల కాలంలో.. జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి దాదాపుగా రూ. పదిహేను కోట్లు ఖర్చు పెట్టారు. కిటీల కోసం.. ఓ సారి ఏకంగా.. రూ.73 లక్షల రూపాయలు విడుదల చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంటికి 1.3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ. ఐదు కోట్లు మంజూరు చేశారు. ఆదే సమయంలో.. ఓ బాత్రూమ్ నిర్మాణానికి రూ. 30 లక్షలు, హెలిప్యాడ్.. ఇతర అవసరాలకు రూ. రెండు కోట్లు విడుదల చేశారు. ఇలా ఈ విడుదల పరంపర ప్రతి నెలా సాగుతూనే ఉంది.

నిజానికి.. జగన్ ఇంటి కోసం మంజూరు చేసిన నిధులతో.. ఓ విలాసవంతమైన ఇల్లునే నిర్మించవచ్చు. కానీ గత ఆరు నెలలుగా.. ఏదో ఓ వంకతో.. ఆ ఇంటికి నిధులు మంజూరు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు.. విడుదల చేసుకున్న రూ. మూడు కోట్లు వద్దనడంతో.. ఇప్పటి వరకూ.. తన ఇళ్ల కోసం ఖర్చు పెట్టుకున్న మొత్తం తిరిగి ఇస్తారా.. అన్న చర్చ ప్రారంభమైంది. వాటిని ఖజానాకు మళ్లీ జమ చేయాలన్న డిమాండ్లు కూడా.. వినిపించడం ప్రారంభించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన కేటీఆర్..!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచన టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన సంకేతాలను పార్టీ నేతలు ఇచ్చేశారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఆ పరిధిలోని ఎమ్మెల్యేలతో...

బ్లడ్ క్యాంప్‌ కోసం పిలుపిస్తే నారా రోహితే లీడరనేస్తున్నారు..!

తెలంగాణ తెలుగుదేశం నేతలు ఎవరైనా నాయకుడు కనిపిస్తాడా అని చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎలా ఉన్నాయంటే.. చివరికి పార్టీ ఆఫీసులో తలసేమియా బాధితుల కోసం ఓ...

HOT NEWS

[X] Close
[X] Close