జగన్ మోహన్ రెడ్డి పెళ్లికెళ్లినా సరే జన సమీకరణ ఉండాలి. మరి కోర్టుకెళ్తే ఉండకూడదా?. అది కూడా పొరుగు రాష్ట్రంలో. తన కోసం హైదరాబాద్ జనం అంతా అల్లాడిపోతారని నిరూపించేందుకు ఆయన రెడీ అయిపోతున్నారు. కోర్టుకు రాకుండా మినహాయింపు కోసం ప్రయత్నించి ..కుదరకపోవడంంతో వారం సమయం అడిగి.. ఇప్పుడు తాను వస్తే ఏం జరుగుతుందో చూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వారం సోమవారమే తాడేపల్లికి వచ్చిన ఆయన కోర్టుకు హాజరయ్యే అంశంపై సమీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇరవయ్యో తేదీన శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మరో దారి లేకపోవడం.. హైకోర్టుకు వెళ్తే సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఆయన కోర్టుకు వెళ్లాలనే అనుకుంటున్నారు. అయితే తాను దాఖలు చేసిన పిటిషన్ లో ఉన్నవన్నీ నిజాలేనని.. ఆయన నిరూపించాలని అనుకుంటున్నారు. నిజానికి హైదరాబాద్ లో వైసీపీకి పట్టు లేదు. ఎవరూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ భారీ జన సమీకరణను ప్లాన్ చేస్తున్నారు.
ఓడిపోయిన తర్వాత జగన్ హైదరాబాద్ రావడం లేదు. బెంగళూరులోనే ఉంటున్నారు. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలోనూ ఆయన హైదరాబాద్ రాలేదు. ఒక్క సారి కేసీఆర్ కింద పడినప్పుడు పరామర్శించడానికి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు, ప్రతిపక్ష నాయకుడిగా గడచిన సంవత్సర కాలంగా జగన్ కోర్టుకు హాజరు కావడం లేదు. ఇక నుంచి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేవారు.
