ఏపీకి కేపిటల్ కాదు.. కాన్సెప్ట్ సిటీలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ సిటీలనే కొత్త కాన్సెప్ట్‌ను ఆలోచించారు. ఐటీ సేవలపై జరిగిన సమీక్షలో.. సీఎంకు ఈ ఆలోచన వచ్చింది. వెంటనే.. తిరుపతి, అనంతపురం, విశాఖల్లో ఈ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని.. దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ సిటీలు ఎంత విస్తీర్ణంలో ఉండాలో… కూడా.. ఆయన చెప్పారు. పది కిలోమీటర్ల లోపు విస్తీర్ణంలో ఉండాలని.. ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆలోచనకు తగ్గట్లుగా.. ఈ కాన్సెప్ట్ సిటీల్లో.. ఏముంటాయి..? ఏమేమి సౌకర్యాలు కల్పించాలి..? ఎలా నిర్మించాలి..? ఖర్చు తదితర అంశాలను అధికారులు రెడీ చేస్తారు. దానికి కొంత సమయం పడుతుంది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి.. కేపిటల్ సిటీకే అడ్రస్ లేకుండా పోయింది. గత ప్రభుత్వం ఆంధ్రుల ఆత్మాభిమానం… అ.. అంటే అమరావతి అంటూ.. హడావుడి చేసిన.. ప్రాజెక్ట్ ను.. పునాదులేసిన రాజధానిని.. ఎక్కడికక్కడ నిలిపివేశారు. అదంతా ఓ కులం వాళ్లదని చెబుతూ… నిలిపివేశారు. దానికి సంబంధించి అభివృద్ధి ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత రాజధానిని ఎంపిక చేస్తామంటూ.. ఓ నిపుణుల కమిటీని నియమించారు. ముఖ్యమంత్రి మనసులో ఏముందో కానీ.. దానికి తగ్గట్లుగా నివేదిక ఇప్పించేందుకు.. రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కేపిటిల్ సిటీ భవిష్యత్ ఆ నివేదికతో తేలిపోనుంది.

బహుశా… అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు చోట్ల రాజధానిని డెలవప్ చేయాలనుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి మాటలను బట్టి తెలుస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. ఒక చోట సచివాలయం.. మరో చోట హైకోర్టు.. మరో చోట.. హెచ్‌వోడీల కార్యాలయాలు లేకపోతే.. అసెంబ్లీని పెట్టి.. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా మొదటి అడుగు… కాన్సెప్ట్ సిటీలుగా భావించవచ్చంటున్నారు. దీనికి సంబంధించి అధికారులు రెడీ చేసే నివేదికతో… కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దానికి కొంత సమయం పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close