కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ విధ్వంసాన్ని తుడిచేస్తూ ముందుకు సాగుతుంటే…కాళ్లలో కట్టెలు పెట్టేందుకు వైసీపీ రెడీ అయిపోతోంది. అధికారం చేపట్టిన నాటి నుంచే అమరావతికి ఓ రూపుమాపు తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దూకుడు పెరిగింది. ప్రజలపై భారం పడకుండా పథకాల అమలుకు వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల పథకాల అమలు కాలేదంటూ వైసీపీ సానుభూతిపరులు వాయిస్ వినిపిస్తున్నారు. కానీ, సాధారణ జనాల నుంచి ఫ్యాన్ పార్టీకి మద్దతు లేకుండా పోతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటూ విమర్శలు చేస్తున్నారు తప్పితే, వాటిని ఎక్స్ పోజ్ చేయడం లేదు. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడటం లేదు.. అంటే రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేవని, సర్కార్ సావ్యంగా పాలన కొనసాగిస్తోంది అని అంగీకరిస్తున్నట్లే కదా. అయినా..ఈ విషయాన్ని వైసీపీ ఎందుకు గుర్తించడం లేదో ..
జగన్ యాలహంక నుంచి కాలు బయటపెట్టేందుకే ఇష్టపడటం లేదు.. చావు రాజకీయం చేసేందుకే అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కానీ, జగన్ పద్ధతి మార్చుకోవడం లేదు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంపై పోరాటం అంటున్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన నేతలతో భేటీ అవుతున్నారు. పోరాటం చేస్తామంటున్నారు..ఇదివరకు ఇలాంటి ప్రకటనలు చేసి, తాడేపల్లికి పిలుపించుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కథ.
దీంతో.. పార్టీ నేతల్లోనూ జగన్ పై ఒకరకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. టైంపాస్ ముచ్చట్ల కోసం ఈ భేటీలు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ప్రజాపోరాటలు అని జనాల్లోకి వెళ్తారా? ఏమో సందేహమే.