జగన్ రెడ్డి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలపై అక్రమాలు జరిగిపోయాయని ప్రెస్ మీట్ పెట్టారు. వారం రోజులుగా నిద్రపోనట్లుగా ఉన్న ఆయన చింపిరిగడ్డంతో .. ఆందోళనతో ఎప్పట్లాగే స్క్రిప్ట్ చూసి తన బాధనంంతా వెళ్లగక్కారు. అయితే అయితే ఇదంతా నిన్న పోలింగ్ అయిపోగానే ట్వీట్ చేసిన చాట భారతమే. ఎవరు సలహాలిస్తున్నారో కానీ ముందుగా ఓ చాట భారతం సజ్జల శిష్యుడితో రాయించుకోవడం..దాన్ని ట్వీట్ చేయడం.. తర్వాత రోజు ప్రెస్ మీట్లో అదే చెప్పడం కామన్ అయిపోయింది.
ఆయన గంటకుపైగా ప్రెస్ మీట్ పెడితే.. దాన్ని అదేపనిగా చూపించి… ఆయన బాధను..తమ బాధగా ఫీలవ్వాల్సిన బాధ్యత రెండు చానళ్లపై ఉంది. ఎంత వర్షాలు, వరదల పరిస్థితి ఉన్నా దాన్ని వదిలేసి..ఈ ఉత్పాత్తి గంటకుపైగా రెండు చానళ్లు చూపించాయి. ఇందులో ఏమైనా కొత్తది ఉందా అంటే లేదు. పోలింగ్ బయట నలుగురు పెడుతున్న దృశ్యాలు చూపించి వాళ్లు రిగ్గింగ్ చేయడానికి వచ్చారని జగన్ వీడియోలు చూపిస్తే.. అవునా అని జనం అనుకోవాల్సిన పరిస్థితి. పోలింగ్ ఏజెంట్లు లేరని జగన్ అంటున్నారు. కానీ అన్ని పోలింగ్ బూతుల్లోనూ వైసీపీ ఏజెంట్లు ఉన్నారు.
సీన్ ఫుటేజీ బయట పెట్టాలని జగన్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడమో చూపించడమో చేస్తుంది. రిగ్గింగ్ లాంటివి జరిగాయో.. ఇంకెమైనా జరిగాయో కానీ రెండు చోట్ల రీపోలింగ్ కు ఆదేశించారు. అయినా జగన్ రెడ్డి.. తాను గెలిచే పరిస్థితి లేదు కాబట్టి.. పరువు పోతుందని గగ్గోలు పెడుతున్నారు. ఇంత కాలం అందర్నీ భయపెట్టి తాము నిర్మించుకున్న కోట కుప్పకూలిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత మాట్లాడినా ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నీలం సాహ్నిని తామే నియమించామని మాత్రం చెప్పుకోలేదు. పోలీసుల్ని నిందించారు. టీడీపీవాళ్లతో బంధుత్వం కలిపారు. కానీ అసలు పోలీసులు పనిచేసేదే ఎస్ఈసీ కనుసన్నల్లో మరి. ఎందుకు నీలం సహాని తప్పు చేశారని నిందించలేదు. కావాలనుకుంటే.. సీన్ ఫుటేజీ ఆమె ఇవ్వగలరు కూడా. జగన్ రెడ్డి పులివెందులలో ఏదో జరిగిందని చెప్పాలనుకున్నారు. కానీ ప్రజలకు మాత్రం.. అక్కడ ప్రజాస్వామ్యం మళ్లీ వచ్చిందని అర్థమయింది.