శాసనమండలిని ఇక ప్రభుత్వం పని చేయనివ్వదా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ .. శాసనమండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  మండలి రద్దుపై జరిగిన చర్చలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.  మండలి రద్దుపై పూర్తి అధికారి.. రాజ్యాంగం అసెంబ్లీకే ఇచ్చిందని చెప్పారు.  ముఖ్యమంత్రి ప్రకటన.. రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే.. అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేయగలదనేది అందరికీ తెలిసిన విషయం. తీర్మానం చేసినట్లుగా..రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 (1)  ప్రకారం చూసినా… పార్లమెంట్‌కే అధికారం ఉంది. ఓ రాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కేంద్రం .. బిల్లు రూపంలో.. పార్లమెంట్ ఉభయసభల్లో పెట్టి ఆమోదింప చేసి..మిగతా లాంఛనం పూర్తి చేయాలి.

మండలి రద్దు అయిపోయిందని జగన్ నిర్ణయించేసుకున్నారా..?

నిబంధనల ప్రకారం.. ఎలా ఉన్నా..  ముఖ్యమంత్రి ఉద్దేశం ప్రకారం.. శాసనమండలి ఇక రద్దు అయిపోయినట్లేనని.. ఎలాంటి వ్యవహారాలు చేపట్టాల్సిన పనిలేని ఆయన భావిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మండలి చైర్మన్ షరీఫ్.. ఇప్పటికే సెలక్ట్ కమిటీ పని ప్రారంభించారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు పై సెలక్ట్ కమిటీని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. అసెంబ్లీ రద్దు  తీర్మానం చేయడం.. ఇక మండలి లేదన్నట్లుగా.. ముఖ్యమంత్రి మాటలు ఉండటంతో.. ఓ రకమైన రాజ్యాంగ సంక్లిష్టత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అసెంబ్లీ సమావేశాలను పెట్టాలనుకున్న ప్రభుత్వం .. మండలి సమావేశాల తేదీలను కూడా ఖరారు చేస్తుంది. దాని ప్రకారం మండలి పని చేస్తుంది. ఇక నుంచి ప్రభుత్వం మండలి సమావేశాలు అవసరం లేదని..  భావించే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. బడ్జెట్ సమావేశాల్లో మండలి సమావేశం కాదు. అలాగని… అధికారికంగా రద్దు కూడా జరగదు. అధికారికంగా… శాసనమండలి రద్దు కాకుండా… ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా… సమావేశాలు నిర్వహించకుండా చేస్తే.. ఆ పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయవచ్చు.

మండలిని ఇక సమావేశ పరిచే చాన్సివ్వరా..?
 
ప్రస్తుతం మండలి విధులు నిర్వహిస్తే.. సెలక్ట్ కమిటీకి వెళ్లిన రెండు బిల్లులపై కమిటీలు ఏర్పాటు కావాలి. సెలక్ట్ కమిటీ పని ప్రారంభమయింతే… వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లే లెక్క. అవి  బయటకు రావాలంటే.. సాధ్యమయ్యే పని కాదు. సెలక్ట్ కమిటీలో..టీడీపీ సభ్యులే ఎక్కువగా ఉంటారు. ఇలా జరగకూడదనే ప్రభుత్వం… మండలి రద్దు తీర్మానం చేసింది..కాబట్టి.. శాసనమండలి పని చేయడానికి ప్రభుత్వం తరపున ఎలాంటి సహాయసహకారాలు అందే అవకాశం ఉండదు. మండలి చైర్మన్ షరీఫ్‌కు ..  శాసనమండలికి సంబంధించినంత వరకూ ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి. కానీ.. ఆ ఆదేశాలను అమలు చేయాల్సింది అధికారులే.  ప్రభుత్వానికి ఇష్టం లేదని తెలిసిన తర్వాత మండలి చైర్మన్ ఆదేశించినట్లుగా చేయడానికి అధికారులు మందుకు రారు.

అధికారికంగా రద్దు కాకుండా కట్టడి చేస్తే రాజ్యాంగ సంక్షోభం రాదా..?

ప్రస్తుత పాలకుల తీరు.. ఎంత కక్ష సాధింపు ధోరణిలో ఉందో .. కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి.. భయపడే ఉద్యోగులే ఎక్కువ. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో.. పలు యూనివర్శిటీల వైస్ చాన్సలర్లు.. ఏపీపీఎస్సీ చైర్మన్ లాంటి వారు చూశారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారన్న కారణంగా వీరిని ప్రభుత్వం దూరం పెట్టింది. వారు పదవులకు రాజీనామాలు చేయకపోతే.. పని చేయకుండా చేసింది. అధికారులెవరూ వారి మాటలు వినకుండా కట్టడి చేసింది. ఏపీపీఎస్సీ చైర్మన్ కోర్టుకెళ్లి.. తనను పని చేయడం లేదని.. చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు.  బహుశా మండలి చైర్మన్‌కు కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close