జగన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. వారం రోజుల సమయం అడిగి మరీ జన సమీకరణ చేశారు. నాలుగైదు వందల మందిని జగన్ రెడ్డి బేగంపేట ఎయిర్ పోర్టులో తన లగ్జరీ విమానంలో దిగిన తర్వాత అందరూ స్వాగతం పలికారు. వారి స్టైల్లో వాళ్లు రప్పా రప్పా పోస్టర్లు వేసుకొచ్చారు. ఇవన్నీ ముందుగా ఊహించిందే కాబట్టి పోలీసులు వాళ్ల జాగ్రత్తలు వాళ్లు తీసుకున్నారు.
అయితే వచ్చిన ఆ కొంత మంది ఎందుకు జగన్ రెడ్డి వైపు దూసుకెళ్తారో ఎవరికీ అర్థం కాదు. తోపులాట జరిగిందన్న ఫీలింగ్ కల్పించడానికి.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెటప్ అని అందరికీ అర్థమైపోతుంది. జగన్ కోసం తోసేసుకున్నారు బాసు అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఈ ఎఫెక్ట్ తీసుకు వస్తారు. కానీ ఈ రోజుల్లోనూ ఇలాంటివి నమ్మేవాళ్లు ఉంటారని జగన్ అండ్ కో అనుకోవడమే అమాయకత్వం.
తోలుకొచ్చిన మూడునాలుగు వందల మందితో బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద షో చేశారు. జగన్ రెడ్డి కోసమే వారిని తీసుకొచ్చారు కాబట్టి ఆయన కూడా వారికి అభివాదం చేశారు. కొంత మందిని కోర్టు దగ్గర గుమికూడేలా చేశారు. అక్కడా తోసుకునే సీన్ క్రియేట్ చేశారు. ఈ తోపులాట ఫాంటసీ ఏమో కానీ జగన్ రెడ్డి.. తనను జనం పట్టించుకోరని అనుకుంటారన్న. మానసిక ఫోబియాతో.. ఎక్కడికి వెళ్లినా ప్లాన్ చేసుకుని జనాన్ని సమీకరించుకుని వెళ్తున్నారు.


