జగన్ రెడ్డి ఎప్పుడు ప్రెస్మీట్ పెట్టినా తాను ప్రజలకు బిర్యానీ పెట్టానని ఇప్పటి ప్రభుత్వం పస్తులు ఉంచుతోందని చెబుతూ ఉంటారు. మొదట్లో ఈ మాటలు నేరుగా చెప్పేవారు. రాను రాను తన పథకాలను వల్లే వేస్తున్నారు. కూటమి ఏమీ ఇవ్వడం లేదంటున్నారు. తన పాలన స్వర్ణయుగం అని ఆయన భ్రమలో ఉండి చెబుతున్నట్లుగా చెబుతూంటారు. కూటమి హయాంలో ప్రజలకు ఏమీ అందడం లేదని అనుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని సీరియస్ గా చెబుతూ ఉంటారు. ఆయన తీరు చూస్తే. జగన్ ఏదో లోకంలో బతుకుతూ ఉంటారని ఎవరికైనా అర్థం అయిపోతుంది.
ఏదో లోకంలో ఉంటున్న జగన్
జగన్మోహన్ రెడ్డికి ఎవరో రాసిస్తారు. అదే నిజం అని అనుకుంటున్నారు. తన హయాంలో జరిగిన వ్యవహారాలు ఏమిటో ఆయనకు తెలియవన్నట్లుగా ఉంటారు. పథకాలు అద్భుతంగా అమలయ్యాయని ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా చెబుతారంటే..తనకు పదకొండు సీట్లే వచ్చాయన్న విషయం కూడా ఆయనకు గుర్తు లేనట్లుగా చెబుతారు. నిన్నటి ప్రెస్ మీట్లో ఆయన పంటల భీమా గురించి చెప్పారు. అసలు మూడేళ్ల పాటు పంటల బీమాను జగన్ ఎగ్గొట్టారు. పార్లమెంట్ లో స్వయంగా మంత్రి చెప్పారు. అసెంబ్లీలో కూడా జగన్ ఒప్పుకుని…తాము సొంతంగా అంటే ప్రభుత్వం తరపున ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని కూడా చెప్పారు. అవన్నీ ఆయనకు గుర్తు లేవు. గుర్తు లేనట్లుగా నటిస్తున్నారు.
తాను సీఎంగా లేకపోతే ప్రజలు అన్నం తినరని అనుకోవడం ఏమిటో ?
ఇది ఒక్కటే కాదు.. పంటల మద్దతు ధర దగ్గర నుంచి ప్రతి విషయంలో అంతే. తన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అనుకుంటారు. సరే అది ఆయన నమ్మకం అనుకుందాం.. మరి ఇప్పుడు ఎందుకు కూటమి పాలనలో ప్రజలు అందరూ కష్టాలు పడుతున్నారని అనుకుంటారు?. అంటే సరైన ఫీడ్ బ్యాక్ ఆయనకు అందడం లేదు. జగన్ రెడ్డి తనకు ఫోన్ లేదని చెబుతూ ఉంటారు అంటే ఆయనకు రెగ్యులర్ అప్ డేట్స్ రావు. సజ్జల లేదా.. మరొకరు రాసిచ్చేవే బైబిల్ వాక్యాలు. వాటినే నమ్ముతారు. కనీసం ఓ ఫోన్ ఉండి.. అందులో సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తూ ఉంటే…ఆయనకు కొన్ని పచ్చి నిజాలు తెలిసే అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రయత్నం ఆయన చేస్తున్నట్లుగా లేదు.
సొంత ఫోన్ వాడి.. సోషల్ మీడియాలోకి వెళ్తే కనీస ఫీడ్ బ్యాక్ తెలిసే చా్స్
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సజ్జల లాంటి వారినో.. సాక్షి పత్రిక నుంచి వచ్చే రిపోర్టుల్ని కాకుండా…తనకు నిజాయితీగా పరిస్థితుల్ని విశ్లేషించి చెప్పే మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది . చేదు వార్తలు చెప్పినా.. పాజిటివ్ గా తీసుకుని మార్చుకునే మైండ్ సెట్ తీసుకుంటే చాలా మంది నిజాలు చెబుతారు. అప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు. అలాంటిదేమీ లేకుండా ఇలా .. ఏదో లోకంలో ఉంటూ .. మాట్లాడుతూ పోతే.. ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికే సగం మంది డిటాచ్ అయిపోయారు. మిగతా వారు కూడా అలాగే అయిపోతారు. అప్పుడు నిజాలు తెలుసుకున్నా ప్రయోజనం ఉండదు.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                