జగన్ రెడ్డి తన ట్రేడ్ మార్క్ హామీని పులివెందుల ప్రజలకు ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన ప్రజాదర్భార్ పేరుతో ప్రజలకు కొంత సమయం కేటాయించారు. వచ్చిన వారంతా తమ సమస్యలను ఏకరవు పెట్టారు. అందరికీ ఒకటే సమాధానం చెప్పారు జగన్ రెడ్డి. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు అన్ని సమస్యలూ తీరిపోతాయని చెప్పుకొచ్చారు. అదే హామీతో అందరూ తిరిగి వెళ్లారు. కానీ ఎవరికైనా వ్యక్తిగతంగా అయినా కాస్త సాయం చేసేందుకు ముందుగు రాలేదు.
వినతి పత్రాలు తీసుకోవడానికి దర్బార్ ఎందుకు?
సీఎంగా ఓడిపోయాక.. రెండు, మూడు సార్లు పులివెందులలో ప్రజాదర్బార్ పెట్టారు. ఎప్పుడు ఇలా పెట్టినా పార్టీ నేతలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి తమకు బిల్లులు రావాల్సి ఉన్నాయని.. బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకున్నామని సాయం చేయాలని కోరేవారు. అయితే జగన్ వారికి ఇప్పుడు మన దగ్గర అధికారం లేదు కాబట్టి కోర్టుకు వెళ్లి అయినా బిల్లులు ఇప్పిస్తామని చెప్పేవారు. తర్వాత ప్రజాదర్బార్ చాలా కాలం ఆపేశారు. ఇటీవల జడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు రావడంతో ఇప్పుడు మనసు మార్చుకున్నారు. మళ్లీ ప్రజాదర్బార్ నిర్వహించేందుకు మొగ్గు చూపారు.
ఎన్నికలకు ముందు భారీగా డబ్బుల పంపిణీ
గత ఎన్నికలకు ముందు వైసీపీ క్యాడర్ కు స్థాయిని బట్టి డబ్బులు పంపిణీ చేశారు. మండల స్థాయి నేతకు పది లక్షల వరకూ ఇచ్చారు. అడగకపోయినా ఇవ్వడంతో వారంతా ఖుషీ అయ్యారు. కానీ బెట్టింగుల్లో ఎక్కువగా పోయాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండటంతో పనులు కావడం లేదు. దీంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. క్యాడర్ అంతా ఎంతో కొంత జగన్ సాయం చేస్తారని ఆశతో వస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ రూపాయి కూడా ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక మంచి రోజులు వస్తాయని చెప్పి వారిని సంతోషపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు .
పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు ఎంతో కొంత సాయంచేయవచ్చుగా !
అనారోగ్యం సమస్యతో చికిత్స చేయించుకోవడానికి సాయం కోసం వచ్చినా .. జగన్ ట్రేడ్ మార్క్ సమాధానమే ఆయన వద్ద నుంచి వస్తోంది. పార్టీ నేతలు కూడా తాము సాయం చేస్తాం… అని మీరు మాత్రం హామీ ఇవ్వండి చాలు అని.. జగన్ తో చెప్పించినా వాళ్లు సంతోషరడతారు. కానీ అలాంటి హామీ కూడా ఇవ్వరు. అరటి రైతులకు నష్టాలొస్తున్నాయని వారిని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. వారికేమైనా సాయం చేస్తారేమో చూడాల్సి ఉంది !