నీ ఏడుపే మాకు దీవెనలు అని లోకేష్ ట్వీట్లు పెడుతూంటారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఏడుపులు చూస్తూంటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. పోటీ పడుతున్న వ్యక్తిపై గెలవలేనప్పుడు .. పోటీ చేయడం చేతకాని వ్యక్తి ఏం చేస్తాడు ?. తిట్లందుకుంటాడు.. పిల్లి శాపాలు పెడతాడు.. అంతకు మించి ఏమీ చేయలేడు. ఎప్పటికీ ఏమీ చేయలేడు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి తన శక్తి సామర్థ్యాల మీద పోటీ చేస్తూ ఉంటాడు. కానీ ఇతగాడు మాత్రం.. ఇలాంటి తిట్లు, పిల్లి శాపాల మీద బతకేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్లు ఎప్పటికైనా ఓ అడుగు ముందుకు వేయలేరు. దీనికి సాక్ష్యం జగన్ రెడ్డే.
పులివెందుల, ఒంటిమిట్టల్లో పోలింగ్ జరిగితే.. అక్కడి ప్రజలు తనకు ఓట్లు వేయలేదని అర్థం చేసుకుని అదంతా టీడీపీ మీద రుద్దే పనిలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థిని వ్యక్తిగత శత్రువుగా చూసే సైకో మెంటాలిటీని ఒంట బట్టించుకుని అదే సంస్కృతిని వ్యాపింపచేయడానికి ప్రయత్నిస్తూ చివరికి.. మాటల్లోనూ తన ప్రత్యర్థి ప్రాణాల గురించి మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. ఆయన మాటలు చూసి వైసీపీ నాయకులు కూడా సిగ్గుతో తలదించుకుంటారు. చంద్రబాబు కూడా అలా ఆలోచిస్తే తమ పరిస్థితేమిటని వారిలో ఎవరో ఒకరికి డౌట్ రాకుండా ఉండదు.
జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నాలకు లెక్క లేదు. ఆయన వయసు కారణంగా రాళ్ల దెబ్బలు కొడితే ప్రాణాపాయం ఉంటుందని ఎక్కడికి వెళ్లినా రాళ్ల దాడులు చేయించారు. ఎప్పటికప్పుడు చంద్రబాబు తనను కాపాడుకున్నారు కానీ జగన్ రెడ్డి గురించి బయట పెట్టలేదు. ఘోరమైన మనస్థత్వంతో .. నిత్యం చంద్రబాబు మీద ఏడుస్తూ బతికే జగన్ రెడ్డికి ఇప్పటికే మానసికమే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉంటాయని టీడీపీ నేతలు అంటున్నారు. మనిషిలో ఉండే కుళ్లు, ఈర్ష్య, ద్వేషాలతో వచ్చి పడే ఆరోగ్య సమస్యలే ఎక్కువ నష్టం చేస్తాయి.
జగన్ రెడ్డి కన్నూమిన్నూ కానరాకుండా రాజకీయాలు చేశారు. ఇప్పటికీ తన పిచ్చితనాన్ని .. సైకో తనాన్ని రాజకీయం అనే అనుకుంటున్నారు. చంద్రబాబును పెద్దిరెడ్డి కొట్టారని చెప్పుకోవడం కూడా అలాంటిదే. కానీ ఆయన గురించి అందరికీ తెలిసిపోయింది. అందుకే దేశంలో ఒక్క రాజకీయ పార్టీ అంటే.. ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆయనను పలకరించడం లేదు. అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వడం లేదు. తల్లి, చెల్లి కూడా ఛీ కొట్టిన ఈ లీడర్ .. ఏడుపులో టీడీపీ, చంద్రబాబుకు దీవెనలుగా ఉంటాయి. ఇలాంటి వారిని తిరిగి తిట్టినా.. టీడీపీ అ బురద అంటించుకోవడమే అవుతుంది.