జగన్ హయాం – పారిశ్రామికవేత్తలకు పీడకల !

శ్రీసిటీలో చంద్రబాబు పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొంత మంది ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాల ప్రస్తావన తీసుకు వచ్చారు. తాము ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టాం కానీ ప్రభుత్వం హమీ నెరవేర్చుకోలేదన్నది వారి భావన. తాజాగా హెచ్‌సీఎల్ ప్రతినిధులు లోకేష్ ను కలిసినప్పుడు కూడా.. ఒప్పందం ప్రకారం తమకు రావాల్సిన ప్రారిశ్రామిక ప్రోత్సాహకాలు అందలేదని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లోకేష్ కూడా ఆశ్చర్యపోయారు.

పారిశ్రామిక ప్రోత్సహకాలు అనేది ప్రతి రాష్ట్ర విధానంలో ఓ భాగం. పెట్టుబడులు వస్తే నిరంతర అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అందుకే కొంత రాయితీలు ఇచ్చి అయినా పరిశ్రమల్ని ఆకర్షిస్తూంటారు. గత ప్రభుత్వం.. షిరిడి సాయికి.. మేఘాకు.. రాఘవ కన్ స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన రాయితీలు… కియా, హెచ్‌సీఎల్ తో పాటు ఇతర బడా కంపెనీలకు ఇవ్వలే్దు. ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. ఫలితంగా పారిశ్రామిక వృద్ధి పూర్తిగా మందగించింది.

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అందరూ తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీల గురించి .. వాకబు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వారు పడిన వేదన చూసి .. ప్రభుత్వం కూడా వేగంగా స్పందిస్తోంది. పారిశ్రామిక రాయితీలే కాదు.. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మరింత అనుకూలమైన పాలసీని తీసుకొస్తామని హామీ ఇస్తున్నారు. ఓ రాష్ట్ర పారిశ్రామిక వాతారవణాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ఏ ప్రభుత్వం కూడా సిద్ధం కాదు. కానీ జగన్ మాత్రం వేరు. తన స్వలాభం కోసం.. మొత్తం ఏపీ పారిశ్రామిక వాతావరణాన్ని నాశనం చేశారు.

తనకు తెలిసిన కొంత మంది … ఆ గాలి మరల విద్యుత్ లో పెట్టుబడులు పెట్టడమే పారిశ్రామికాభివృద్ధి అన్నట్లుగా వ్యవహరించారు. ఏ రాయితీలు ఇచ్చినా వారికే ఇచ్చారు. తనకు మేలు చేసుకున్నారు కానీ రాష్ట్రాన్ని నాశనం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: జీతూ జోసెఫ్ క్రైమ్ కామెడీ నవ్వించిందా?

సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ తీసే దర్శకుడు జీతూ జోసెఫ్. ఆయన సినిమాలకి ఒక కల్ట్ ఫాలోయింగ్ వుంది. దృశ్యం సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా ఆదరించారు. ఇప్పుడాయన నుంచి ఓ క్రైమ్ కామెడీ వచ్చింది....

కోడి రామ్మూర్తి నాయుడుగా రామ్‌చ‌ర‌ణ్‌?

రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు ఈ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కిస్తారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తిక‌ర‌మైన విష‌యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది....

బాచుపల్లిలో ఇప్పటికీ అందుబాటు ధరల్లోనే ఇళ్లు !

బాచుపల్లి అంటే అమ్మో కాస్ట్ లీనా అనుకునే పరిస్థితి వచ్చింది. నిజానికి ఒకప్పుడు అబ్బో బాచుపల్లినా అంత దూరం ఎవరు వస్తారు అనుకునేవారు. ఒకప్పుడు అంటే.. ఎంతో కాలంకిందట కాదు.. జస్ట్ పదేళ్ల...

సెప్టెంబర్ 17 ఓన్లీ నిమజ్జనం డే !

సెప్టెంబర్ 17 అంటే.. తెలంగాణ రాజకీయాలకు ఓ ఊపు వస్తుంది. దాదాపుగా నెల రోజుల ముందు నుంచే మాటల మంటలు ప్రారంభమవుతాయి. ఆ రోజున వారి వారి పార్టీల విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close