మాగుంటపై జగన్ రెడ్డికి అంత ద్వేషం ఎందుకు!?

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై జగన్ రెడ్డి అంత ద్వేషం ఎందుకు పెచుకున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు. ఇదే మాగుంటను గత ఎన్నికలకు ముందు బతిమాలి మరీ వైసీపీలోకి తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని కాదని మాగుంటకు టిక్కెట్ ఇచ్చారు. ఎందుకంటే మాగుంట వల్ల ప్రకాశం జిల్లాలోనే కాదు నెల్లూరులోనూ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అదే నేతను పట్టుబట్టి మెడపట్టి బయటకు గెంటేస్తున్నారు.

మాగుంట వల్ల ఎంతో మేలు ఉంటుందనే తాను పట్టుబడుతున్నానని బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు. ఎవరూ పట్టించుకోకపోతే తనకెందకంటున్నారు. నిజానికి మంత్రిగా ఉన్న సమయంలో బాలినేనికి, మాగుంటకు సరిపడేది కాదు. కానీ ఇప్పుడు ఆయననే గట్టిగా సమర్థిస్తున్నారు బాలినేని. మాగుంటను కాదని తిరుపతి నుంచి చెవిరెడ్డిని తెచ్చి టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్నదానిపైనా స్పష్టత లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట తండ్రీ కొడుకుల పేర్లు ఉన్నాయి. కానీ తండ్రీని అరెస్టు చేయలేదు. కుమారుడ్ని అరెస్టు చేశారు. ఆయన చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్ గా మారి పూర్తి స్థాయి బెయిల్ తెచ్చుకున్నారు ఈ వ్యవహారంలో సాయిరెడ్డి అల్లుడి సోదరుడిదే కీలక పాత్ర. ఈ కేసు కారణంగా ఆయనపై వ్యతిరేకత పెంచుకోరు.

మరి ఎందుకు మాగుంటను వద్దనుకుంటున్నారో వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు. పంజాబ్ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆర్థిక సాయం అందించారని చెబుతున్నారు. ఈ ఆర్థిక సాయాన్ని జగన్ రెడ్డి చెప్పడం వల్లనే మాగుంట ఇచ్చారని బీజేపీ అనుమానిస్తోంది. ఇప్పుడు మాగుంటకు టిక్కెట్ ఇస్తే.. అదే నిజమనుని బీజేపీ తనపై కక్ష సాధింపులకు పాల్పడుతుందన్న భయంతోనే మాగుంటను పక్కన పెట్టాలని అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు ఓ నిర్దారణకు వస్తున్నాయ. మాగుంటకు సీటివ్వకపోతే బాలినేని కూడా దూరమవుతాడని తెలిసినా సరే బీజేపీ భయంతోనే మాగుంటను దూరం పెడుతున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close