పొదిలిలో మహిళల, పోలీసులపై రాళ్ల దాడులు చేసిన వారికి జగన్ రెడ్డి మద్దతుగా మాట్లాడుతున్నారు. సీసీ ఫుటేజీలో చూసి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేస్తున్నారు. ఇప్పటి వరకూ పాతిక మంది వరకూ అరెస్టు చేశారు. దర్శి ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆరేడు నియోజకవర్గాల నుంచి రౌడీలను తీసుకు వచ్చి.. ఉద్దేశపూర్వకంగా దాడులు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. మహిళలపై దాడుల్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు.
పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తూండటంతో.. జగన్ రెడ్డి తెరపైకి వచ్చారు. సామాన్య ప్రజల్ని అరెస్టు చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. పొదిరి పర్యటనకు పొదిలి వాళ్లను కాకుండా బయట వాళ్లను సమీకరించి తీసుకు వచ్చింది కాకుండా దాడులు చేయించి.. వారిని అరెస్టు చేస్తే మద్దతుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని ప్రోత్సహించి వారికి తానున్నాన్న సందేశాన్ని పంపడానికే ఇలాంటి పర్యటనలు చేస్తున్నారన్న అనుమానాలు ఈ ఘటనతో మరింతగా బలపడుతున్నాయి.
అక్కడ ఉన్న నలభై వేల మంది తిరగబడితే పరిస్థితి ఏమటిన్న హెచ్చరికలు కూడా జగన్ చేశారు. నిజానికి.. ఆయన పర్యటనలో రెండు వేల మంది కూడా లేరు. వారిలోనూ ఇతర నియోజకవర్గాల నుంచి తరలించుకు వచ్చిన వారే ఎక్కువ. గత ఎన్నికల్లో పొదిలి పరిధిలోకి వచ్చే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వారు కూడా రాలేదు. తన పర్యటనకు నలభై వేల మంది వచ్చారని చెప్పుకోవడానికి.. వారంతా తిరగబడతారన్నట్లుగా కలరింగ్ ఇవ్వడానికి స్పందించినట్లుగా ఉంది. అదే సమయంలో తనతో వచ్చే వారంతా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్లినా రాళ్ల దాడులు జరిగేవి.. కుప్పంలోనూ అదే పని చేసేవారు. చివరికి సహనం నశించి పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. ఇప్పుడు జగన్ రెడ్డికి దూరంగా రోడ్డుపక్కన నిలబడి నిరసన చేస్తేనే.. మా వాళ్లు తిరగబడతారని హెచ్చరిస్తున్నారు. గత పాలన లో ఏం జరిగిందో ఎప్పటికప్పుడు గుర్తు చేసేందుకు ఆయన ఓ మనిషిని పెట్టుకుంటే బెటరన్న సలహాలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.