సందర్భం లేకుండానే సచ్చిదానంద ఆశ్రమానికి సీఎం జగన్ !

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వామిజీల ఆశ్రయాలను సందర్శించడం అరుదు. సందర్శిస్తే ఎక్కువగా విశాఖ శారదాపీఠాన్ని ఎంచుకుంటారు. అయితే అనూహ్యంగా ఈ సారి విజయవాడలో ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించాలని నిర్ణయించారు. మామూలుగా ఏదైనా కార్యక్రమం ఉండి.. ఆశ్రమ నిర్వాహకులు పిలిస్తే వెళ్లి అందులో పాల్గొని రావడం సహజం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో అలా ఓ సారి ఆశ్రమానికి వెళ్లారు.

అయితే కరకట్ట మీద ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. విజయవాడలోని దత్తనగర్‌లో ఉన్న ఆశ్రమానికి వెళ్లలేదు. ఇప్పుడు దత్తనగర్ ఆశ్రమానికి వెళ్తున్నారు. ఆశ్రమంలో ఉన్న ఆలయాలను చూస్తారు. మరకత రాజరాజేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్వామిజీతో సమావేశం అవుతారు. దాదాపుగా గంటన్నర సేపు ఆయన పర్యటన ఉంటుంది. ఈ పర్యటన ఉద్దేశం ఏమిటో వైసీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. ఆశ్రమంలో ఏదైనా ఉత్సవాలు జరిగితే వెళ్లి తీర్థప్రసాదాలు స్వీకరించి రావడం సహజమే.

కానీ ప్రత్యేకంగా ఏ కార్యక్రమం లేదు.. దసరా ఉత్సవాలు కూడా ముగిసిపోయిన తర్వాత ఆయన ఆశ్రమాన్ని ఎందుకు సందర్శిస్తున్నారన్నది ఇతర రాజకీయ పార్టీలకు కూడా పజిల్‌గా మారింది. అందుకే అందరూ ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగం అంటూ ఊహాగానాలు ప్రారంభించేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close