శుక్రవారం బెంగళూరుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లికి రావాలనుకున్నారు. అందు కోసం ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కానీ తుపాను కారణంగా విమానాలు రద్దయ్యాయని అందుకే జగన్ రెడ్డి రాలేకపోతున్నారని వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రతి మంగళవారం లేదా బుధవారం వచ్చి శుక్రవారం ఆయన బెంగళూరు వెళ్తారు. ఈ వారం తుపాను కారణంగా విమానాలు రద్దు కావడంతో రాలేకపోయారు. బుధవారం విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే వస్తారు లేకపోతే.. పునర్దర్శనం వచ్చే మంగళవారం.
ఈ లోపు పార్టీ కార్యకర్తలంతా.. తుపాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని.. ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాలని జగన్ సందేశం ఇచ్చారు. విమానం అందుబాటులో లేదని ఆయన మాత్రం బెంగళూరులో రిలాక్స్ అవుతారు.. పార్టీ నేతలను మాత్రం సొంత డబ్బులతో జగన్ పేరు మీద ప్రచార .. సహాయ కార్యక్రమాలు చేయాలి. అధికారంలో ఉన్నా జగన్ రెడ్డి తీరు అంతే ఉండేది. విపత్తు వస్తూందంటే.. అంతా అయిపోయాక.. రెడ్ కార్పెట్లు వేసుకుని నష్టాన్ని పరిశీలిస్తారు. రూపాయి అయినా నష్టపరిహారం ఇచ్చేవారు కాదు.
ఇప్పుడు కూడా అంతే. విపత్తులు వచ్చేశాక.. శవరాజకీయాలు,పంటల పరిశీలనలు ఏమైనా అవసరం అయితే అప్పుడు రాజకీయం చేయడానికి వస్తారు. సీఎంగా ఉన్నప్పడు తన సొంత జిల్లాలో డ్యాం కొట్టుకుపోతే వారం రోజుల పాటు కనీసం చూసేందుకు కూడా వెళ్లలేదు. ఇలాంటి నాయకత్వంతోనే ఆయన రాజకీయాలు చేస్తున్నారు.