ఆర్కే పలుకు : కేసులు ఎలా పెట్టొచ్చో నేర్పుతున్న జగన్ రెడ్డి !

జగన్ రెడ్డి తన క్రిమినాలజీతో కేసులు ఎలా పెట్టవచ్చో చంద్రబాబుకు నేర్పుతున్నారని ఐదు నెలల తర్వాత దాదాపుగా మూడేళ్ల పాటు కేసుల మీద కేసులతో జగన్ రెడ్డి జైల్లో ఉంటారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ వారం తన కొత్తపలుకులో జోస్యం చెప్పారు. చంద్రబాబు పై పెడుతున్న కేసుల్లో ప్రాథమిక ఆధారాలు లేకుండా కేబినెట్ నిర్ణయాలను తప్పు పడుతూ.. కింది స్థాయిలో ఉన్న తన వర్గం వారితో ఫిర్యాదులు చేస్తూ అడ్డగోలు కేసులు పెట్టడాన్ని… వాటిని దిగువ కోర్టు కనీసం ప్రశ్నించకుండా… రాజకీయ ప్రత్యర్థులందర్నీ అరెస్టు చేస్తే రిమాండ్ కు పంపించడాన్ని ఆయన ఈ వారం కొత్త పలుకులో గట్టిగానే ప్రశ్నించారు. అసలు కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థుల్ని అరెస్టులు చేస్తున్నారు కానీ., . వారిపై నేరం చేశారని అభియోగాల్ని ఎందుకు నమోదు చేయడం లేదని ఆర్కే ప్రశ్నిస్తున్నారు.

చార్జిషీటు దాఖలు చేయాలంటే నేరం జరిగినట్లుగా నిరూపిస్తూ ఆధారాలు సమర్పించాలి. గాలి కబుర్లు పోగేసి… సాక్షి పత్రికలో రాసిన కథనాలను సాక్ష్యంగా చూపిస్తే సరిపోదు. అందుకే… గత నాలుగున్నరేళ్లలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఏ ఒక్క టీడీపీ నేత విషయంలోనూ చార్జిషీటు దాఖలు చేయలేదు. అయినా కొత్త కేసులు పెడుతున్నారు. ఈ విషయాన్ని కోర్టులు ఎందుకు పట్టించుకోవని ఆర్కే ప్రశ్నిస్తున్నారు. న్యాయవ్యవస్థను వాడుకుని ఇలా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ అన్నది ఆర్కే విశ్లేషణ.

ఏపీలో ఉన్న పరిస్థితులను… అందరూ ఎగతాళి చేస్తున్నా జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారని… బీఆర్ఎస్ నేతలు ఎగతాళి చేస్తున్నా కనీసం కౌంటర్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఆర్కే ఎకతాళి చేస్తున్నారు. ఆర్కే ప్రతీ వారం ఇదే తరహాలో రాస్తారు కానీ… ఈ సారి చంద్రబాబు కేసుల్లో ఏమీ లేదని వాదించలేదు. అది ప్రజలకు అర్థమైపోయిందని… జగన్ రెడ్డికి పిచ్చి పట్టుకుందని… ఓ సైకో అని ప్రజలు నమ్ముతున్నారని ఆయనంటున్నారు.

ఇక్కడ ఆర్కే విశ్లేషణ ఏమిటంటే.. జగన్ రెడ్డి చేసిన పని వల్ల కేసీఆర్ కు నష్టం జరగబోతోంది. అందుకే…. విరుగుడుగా.. గచ్చిబౌలి స్టేడియంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ రెడ్డికి మద్దతు … సీబీఎన్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రాం తరహాలో ఓ కార్యక్రమం చేపట్టబోతున్నారట. అంటే… పరోక్షంగా బీఆర్ఎస్ కు మద్దతు తెలియచేయడమే. మొత్తంగా చంద్రబాబు అరెస్టు రెండు రాష్ట్రాల రాజకీయాల్ని మార్చిందని ఆర్కే భావన .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాల్పులు – నరికి వేతలు ! గోదావరి జిల్లాల్లో రక్త చరిత్ర !

ఓ వ్యక్తిని ఇంట్లోనే రెండు రౌండ్లతో కాల్చి చంపేశారు. అదీ కూడా గోదావరి జిల్లాల్లో. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో ఇలాంటి హత్యలు కూడా జరుగుతున్నాయా అని జనం ఆశ్చర్యపోయారు. చనిపోయిన...

‘హ‌ను – మాన్‌’ బ‌లం స‌రిపోతుందా?

'హను - మాన్‌' ప్రాజెక్ట్ మొద‌లెట్టిన‌ప్పుడు ఎవ‌రికీ ఆ సినిమాపై ఆశ‌లు, అంచ‌నాలూ లేవు. ఎప్పుడైతే టీజ‌ర్ వ‌చ్చిందో.. అప్పుడు అటెన్ష‌న్ సంపాదించుకొంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఏదో చేస్తున్నాడు, ఓ విజువ‌ల్ వండ‌ర్...

సుప్రీంకోర్టు తీర్పులపైనా నీలి, కూలి మీడియా తప్పుడు ప్రచారం !

తెలుగులో నీలి, కూలి మీడియా వ్యవహారం రాను రాను సంచలనంగా మారుతోంది. ఎంతగా అంటే చివరికి సుప్రీంకోర్టు తీర్పులనూ పూర్తిగా రివర్స్ లో ప్రచారం చేసేంత. సుప్రీంకోర్టు...

ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కంపెనీ ఇచ్చిన సొమ్ము జగన్ రెడ్డి సర్కార్ నొక్కేసిందా !?

జగన్ రెడ్డి సీఎం సీట్లో కూర్చోగానే... ఏపీలో జరిగిన అతి పెద్ద అరిష్టం విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం. ఆ ఘటనపై చాలా అనుమానాలున్నా... విచారణలో ఏదీ బయటకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close