మ‌రో ఓదార్పు యాత్ర ఆలోచ‌న‌ల్లో జ‌గ‌న్?

మాజీ సీఎం జ‌గ‌న్ మ‌రో ఓదార్పు యాత్ర‌కు రెడీ అవుతున్నారా…? ఎమ్మెల్సీల‌తో భేటీ త‌ర్వాత నేత‌లంద‌రూ అవున‌నే అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ఓట‌మి త‌ర్వాత జ‌గ‌న్ తాడేప‌ల్లి నివాసానికే ప‌రిమితం అయ్యారు. సీఎంగా చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారం కోసం పిలిచేందుకు ఫోన్ చేసినా స్పందించ‌లేదు. ఓడిన నేత‌ల‌తో ఓసారి మీటింగ్ నిర్వ‌హించార‌ని ఆయ‌న పీఆర్ టీం వీడియోలివ్వ‌గా, తాజాగా ఎమ్మెల్సీల‌తో భేటీ అయ్యారు.

కేవ‌లం 11మంది ఎమ్మెల్యేల‌తో అసెంబ్లీలో జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత హోదాను కూడా కోల్పోయారు. అసెంబ్లీలో వార్ వన్ సైడ్ అని తెలియ‌టంతో… మెజారిటీ ఉన్న మండ‌లిపై ఫోక‌స్ చేశారు. కొత్త ప్ర‌భుత్వం హానీమూన్ లో ఉంద‌ని… టైం ఇద్దామ‌ని చెప్తూనే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌ను గ‌తంలో 16నెల‌లు పాద‌యాత్ర చేశాన‌ని… ఆ వ‌య‌స్సు ఇంకా త‌న‌కు ఉంద‌న్నారు. రాష్ట్రం రావ‌ణ‌కాష్టం అవుతోంద‌ని, ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీకి ఓటేశార‌న్న ఉద్దేశంతో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని…ఆస్తులు ధ్వంసం చేస్తున్నార‌ని, అలాంటి వారిని ప‌రామ‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉందంటూ ఓదార్పు యాత్ర‌పై హింట్ ఇచ్చారు.

గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణంతో ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్లిన ఇప్పుడు మ‌రోసాకు వెతుక్కొని యాత్ర‌కు రెడీ అవుతున్నార‌ని, కానీ జ‌గ‌న్ వేషాల‌ను జ‌నం న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది. జ‌గ‌న్ పాల‌న‌లో వైసీపీ రౌడీరాజ్యం చూశాక‌… జ‌గ‌న్ చెప్పే కార‌ణాల‌ను రాజ‌కీయంగానే చూస్తారు త‌ప్పా సెంటిమెంట్ గా తీసుకోరని స్ప‌ష్టం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

సీఐడీ మాజీ డీజీపై క్రమశిక్షణా చర్యలు ?

విధి నిర్వహణలో తప్పుడు పనులు చేయడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రఘురామ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close