మందడంలోనూ భూములన్నీ ఇళ్ల స్థలాలకే ..!

రాజధానికి రైతులు ఇచ్చిన 35వేల ఎకరాల భూముల్లో రైతులకు ఇవ్వాల్సినవి ఇచ్చి… రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు.. పోను.. ప్రభుత్వానికి ఏడెనిమిది వేల ఎకరాలు మిగులుతాయని.. వాటిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలు చేపట్టి ..రెండు లక్షల లక్షల కోట్ల ఆదాయం సంపాదిస్తామని.. గత ప్రభుత్వం లెక్కలేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మరింత భిన్నంగా ఆలోచించింది. ఆ స్థలాలను.. ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. నిన్నామొన్నటి దాకా నాలుగు వందల ఎకరాలు ఇందు కోసం గుర్తించారని అనుకున్నారు కానీ.. ఇప్పుడది.. 1251 ఎకరాలకు చేరింది.

ఈ ఇళ్ల స్థలాల పంపిణీకి సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(డి)ని ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది. ఈ చట్టం ప్రకారం భూ సమీకరణ కింద సేకరించిన భూమిలో 5 శాతం పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇవ్వాలని పేర్కొందని జీవోలో ప్రభుత్వం చెబుతోంది. ఉగాది రోజున రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన భూముల్లో 1251 ఎకరాలను ఒక్కో సెంటు చొప్పున.. గుంటూరు , కృష్ణా జిల్లాల్లో లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసేసింది. మొత్తం 54వేల మంది లబ్దిదారులకు భూములు పంచనున్నారు.

తాము రాజధాని నిర్మించడానికి ఇచ్చిన భూమిని ఇళ్ల స్థలాల పేరుతో పంచడం రాజ్యాంగ విరుద్ధమని రైతులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ఇంకా విచారణలో ఉండగానే.. ప్రభుత్వం జీవోలు ఇచ్చేస్తోంది. రాజధాని గ్రామాల్లో వేరే జిల్లాల వారికి భూములు కేటాయించడం.. అదీ కూడా.. రాజధాని గ్రామాల్లో ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. గత ప్రభుత్వం రాజధాని గ్రామాల్లో పేదల కోసం అన్ని సౌకర్యాలతో.. ఇళ్లను నిర్మించింది. కానీ.. వాటిని ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిలిపేసింది. ఇప్పుడు వారికి ఆ ఇళ్లను కాకుండా స్థలాలను ఇస్తామని చెబుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close