[X] Close
[X] Close
కేంద్రానికి ఓ మాట చెప్పారు..! ఇక జగన్ పని ప్రారంభిస్తారా..?

ఏ క్షణమైనా మూడు రాజధానులపై ఆర్డినెన్స్ తెస్తాం..! సంబంధిత శాఖ అధికారులందరూ అందుబాటులో ఉండాలని.. ప్రభుత్వ పెద్దలు..శుక్రవారం… సంబంధిత విభాగాలకు సమాచారం ఇచ్చారు. అయితే.. శని, ఆదివారం ప్రభుత్వ పెద్దలు ఎలాంటి చప్పుడు చేయలేదు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని జగన్ అనుకోలేదు. కానీ.. కేంద్రానికి అన్నీ చెప్పే చేస్తున్నామన్న తమ మాటలకు ఓ జస్టిఫికేషన్ తెచ్చుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మూడు రాజధానుల విషయంలో.. ఎలాంటి వ్యతిరేక సంకేతాలు.. రాష్ట్రానికి రాలేదు. కానీ చెప్పకుండా చేయడం అనేది.. మంచిది కాదన్న ఉద్దేశంతోనే.. జగన్ వెళ్లి ఓ మాట చెప్పారంటున్నారు.

ఇప్పటి వరకూ .. కేంద్రం కూడా.. మీడియాలో చూసే.. మూడు రాజధానుల గురించి తెలుసుకున్నామని.. అధికారికంగా స్పందించడానికి ప్రాతిపదిక లేదని.. పార్లమెంట్‌లో కూడా చెబుతూ వస్తోది. ఈ క్రమంలో మొదటి సారి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి, హోంమంత్రికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాల్లో మూడు రాజధానుల గురించి వివరించారు. సహకరించాలని కోరారు. దీనిపై కేంద్రానికి ఏమైనా ప్రత్యేకమైన అభిప్రాయం ఉంటే.. దానికి సంబంధించిన రియాక్షన్.. వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది..లేదంటే.. మౌనం అర్థాంగీకారంగా భావించి.. జగన్మోహన్ రెడ్డి తరలింపు ప్రక్రియను మరింత దూకుడుగా కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.

అయితే..ఆర్డినెన్స్ తెచ్చినా ఇప్పటికిప్పుడు.. తరలింపు సాధ్యం కాదన్న భావనకు ప్రభుత్వం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు తప్పక నిర్వహించాల్సిన పరిస్థితిలో ఉంది. వీటిని మార్చి పదిహేనులోపు పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే.. అధికారులకు తీరిక ఉండదు. తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి… బడ్జెట్ సమావేశాలు నెలరోజులపాటు జరుగుతాయి. ఈ సమయంలో ప్రభుత్వ శాఖలన్నీ అసెంబ్లీ సమావేశాలకు అందుబాటులో ఉండాలి. అంటే.. ఏప్రిల్ నెలాఖరు వరకూ తరలిపు సాధ్యం కాదు. అందుకే అంత హడావుడి అవసరం లేదని ప్రభుత్వం తీరిగ్గా భావిస్తున్నట్లుగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మం

సినీ న‌టుడు న‌ర్సింగ్ యాద‌వ్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న కోమాలోకి వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని య‌శోదా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న...

కోమటి జయరాం కి మాతృ వియోగం, పలువురి సంతాపం

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ ఏప్రిల్ 9, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు....

పేదలకు ప్యాకేజీ ప్రకటించాలని టీడీపీ డిమాండ్..!

పేదలందరికి కుటుంబానికి రూ. ఐదు వేలు చొప్పున పంపిణీ చేయాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఈ మేరకు రాష్ట్రాలకు సూచనలు చేసినా పట్టించుకోవడం లేదని మండి పడింది.రాష్ట్రంలో ప్రస్తుత...

లారెన్స్ విరాళం 3 కోట్లు

డాన్సర్ గా, నటుడిగా, దర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నాడు లారెన్స్‌. ప్ర‌జా సేవ‌లోనూ ముందుంటాడు. ఓ చారిట‌బుల్ ట్ర‌స్ట్ స్థాపించి విక‌లాంగుల‌కు స‌హాయం చేస్తున్నాడు. ఇప్పుడు కరోనాపై పోరాటంలో త‌న...

HOT NEWS