లండన్ నుంచి వచ్చిన జగన్.. ప్రెస్మీట్ పెట్టేందుకే తాడేపల్లికి వచ్చారు. ఒక్క రోజు మాత్రమే ఉదయం రికార్డింగ్.. మధ్యాహ్నం ప్రసారం.. తర్వాత రోజు మధ్యాహ్నం నుంచి మళ్లీ బెంగళూరు పయనం అయ్యారు. విజయవాడకు ఆయన వచ్చినప్పుడు ట్రాఫిక్ ఆపడం.. వెళ్లేటప్పుడు ట్రాఫిక్ ఆపడానికే పోలీసులకు సమయం పడుతోంది. కానీ ఆయన పట్టుమని మూడు రోజులు కూడా తాడేపల్లిలో ఉండటం లేదు.
జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. ఓడిపోయినప్పటి నుండి .. ప్రతీ వారం బెంగళూరుకు వెళ్తున్నారు. మొదట్లో నాలుగు రోజులు తాడేపల్లిలో ఉండేవారు. ఇప్పుడు అది రెండు, మూడు రోజులకు తగ్గిపోయింది. ఒక్కో వారం అసలు రావడం లేదు. గత నెల రోజుల కాలంలోఆయన నాలుగు రోజులు మాత్రమే ఏపీలో ఉన్నారు. తాను తాడేపల్లికి వచ్చానని.. ఏపీకి వచ్చానని చెప్పుకునేందుకు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. స్క్రిప్ట్ రాసేవాళ్లు రాసిచ్చేవి చదివేసి..మధ్యలో తన ప్రతిభను ప్రదర్శించి వెళ్తున్నారు.
మరో రెండేళ్ల పాటు ఆయన ఏపీకి దూరంగానే ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎన్నికలకు ఏడాది లేదా ఏడాదిన్నర ముందు పాదయాత్ర ప్రారంభించే వరకూ చుట్టపుచూపుగా ఏపీకి వచ్చి వెళ్లనున్నారు. మిగతా పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నారు.