కొత్తపలుకు : బీసీలను క్రైస్తవులుగా మార్చే ప్రయత్నంలో జగన్..! బీజేపీకి విరుగుడా..?

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. రాజకీయ పరిణామాలను విశ్లేషించడంలో.. అరుదైన నైపుణ్యం ప్రదర్శిస్తారు. బహుశా ఆయన జర్నలిస్ట్ నుంచి పత్రికాధిపతిగా ఎదిగిన అనుభవం దానికి ఉపయోగపడతూ ఉండవచ్చు. నలభై ఏళ్లుగా ఆయన… కింది స్థాయి నుంచి … క్షేత్ర స్థాయిలో పని చేసిన అనుభవంతో.. ఆయన చెప్పే విశ్లేషణలు.. అబ్బురపరుస్తాయి. నిజమేననిపిస్తారు. ఈ వారం కూడా.. ఏపీ తెలంగాణ రాజకీయాల పట్ల.. అదే తరహా విశ్లేషణ చేశారు.

బీజేపీ తనను వదిలి పెడుతుందని నమ్మలేకపోతున్న జగన్..!

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు.. టీడీపీని టార్గెట్ చేసింది. అంత మాత్రాన వైసీపీని వదిలి పెట్టినట్లు కాదు. వైసీపీని ఇంకా సులువుగా.. చేతుల్లోకి తీసుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి. టీడీపీ సంగతి చూసిన తర్వాత వైసీపీని.. చాలా తేలికగా క్లోజ్ చేయవచ్చు. దానికి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులే ఆయుధాలు. అదే విషయాన్ని “కొత్తపలుకు”లో రాధాకృష్ణ విశ్లేషించారు. ఇంత వరకూ చాలా మందికి క్లారిటీ ఉంది కానీ.. దీన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకుండా ఉంటారా.. అన్నదే అసలు పాయింటనుకున్నారు. ఇప్పుడు దానిపైనా..”కొత్తపలుకు”లో రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఆయన రెండు విభిన్నమైన వ్యూహాలను తెరపైకి తీసుకు వస్తున్నారు. ఓ వైపు… టీడీపీని కార్నర్ చేయడానికి అవసరమైన.. అన్నీ ఆయుధాలను.. బీజేపీకి అందిస్తూనే తనను.. తాను కాపాడుకోవడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

బీసీ క్రైస్తవంతో తనకు ప్లస్ – హోదాతో బీజేపీకి మైనస్..!

బీజేపీ ఏపీలో… తనకు అడ్డం కాకుండా ఉండటానికి… జగన్ అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహంలో మొదటిది.. బీసీలను క్రైస్తవులుగా మార్చడం. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల్లో.. అత్యధికులు.. క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. వారంతా.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారు. బీసీలను కూడా క్రైస్తవులుగా మార్చితే.. ఏపీలో బీజేపీ బలపడినా… తనను ఏమీ చేయలేరన్న భావనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా రాధాకృష్ణ చెబుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే.. కొన్ని కొన్ని ఘటనలు బయటకు వచ్చాయి. కొన్ని వీడియోలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక రెండోది ప్రత్యేకహోదా. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి… ప్రత్యేకహోదా అంశాన్ని పట్టించుకోకపోయినా అడిగేవారుండేవారు కాదు. కానీ ఆయన పదే పదే ప్రత్యేకహోదా అంశాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. సమావేశాల్లో అడుగుతున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నట్లుగా కనిపిస్తున్నా.. తర్వాత అదే విషయంలో.. బీజేపీపై వ్యతిరేకత పెంచడానికి అస్త్రంగా వాడుకోవలానే క్రమంలోనే దీన్ని జగన్మోహన్ రెడ్డి… ఉపయోగించుకుంటున్నారని రాధాకృష్ణ విశ్లేషించారు. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.

తెలంగాణ రాజకీయాల్లో రెడ్ల కోసం బీజేపీ తంటాలు..!/,/span>

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బీజేపీ ఆపరేషన్‌ ఏ స్థాయిలో సాగుతుందో కూడా.. రాధాకృష్ణ .. వివరించాు. గ్రామాల్లో ఆరెస్సెస్ దళాల సంచారం… రెడ్డి సామాజికవర్గంపై.. బీజేపీ పెద్దలు పెట్టిన గురి… చాలా ఉద్ధృతంగా ఉందని నమ్ముతున్నారు. హరీష్ రావు వస్తారని.. బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అలాంటి అవకాశాలు లేవని వారికి క్లారిటీ వచ్చిందని… అందుకే… రెడ్డి సామాజికవర్గంపై దృష్టి పెట్టారంటున్నారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయని… రాధాకృష్ణ చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com