ఆ చర్చను జగన్ ప్రజల్లో పెట్టలేకపోయారా..?

మేనిఫెస్టో వచ్చేసింది, ఎన్నికలకు మూడురోజులే గడువుంది, ఎన్నికల ప్రచారపర్వం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో, ఏ రాజకీయ పార్టీ ప్రచారమైనా ఎలా ఉండాలి..? తాము అనుకున్నవి ప్రజలకు వివరించేశామనీ, తామే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే స్పష్టమైన అవగాహనను ప్రజలకు ఇచ్చేశామన్నట్టుగా ఉండాలి. కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి… ఇంకా చర్చించాల్సింది ఏదో మిగిలిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో జగన్ ప్రచారం చేశారు.

మోసపూరితమైన మేనిఫెస్టో తయారు చేసుకుని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ పాలన మీద చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనపై చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి కాలేదనీ, రైతు రుణమాఫీ జరగలేదనీ, డ్వాక్రా మహిళలకు న్యాయం చెయ్యలేకపోయారనీ… ఇలా రొటీన్ గా ఎప్పుడూ చేసే విమర్శలు యథావిధిగా చేశారు.

టీడీపీ పాలన మీద చర్చ జరిగితే, ఆ పార్టీకి డిపాజిట్లు రావని జగన్ ఇప్పుడు చెబుతుంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇన్నాళ్లూ ఆ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షంగా విఫలమయ్యామని ఆయనే ఒప్పుకుంటూ ఉన్నట్టేనా? ఇన్నాళ్లూ తాను చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఎలాంటి చర్చకూ ఉపయోగపడలేదని చెప్తున్నట్టా..? ‘చర్చ జరిగితే’ అని ఇప్పుడు చెప్తుంటే.. ఆ చర్చకు సమయం ఎక్కడుంది? ఈ రకంగా జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తోందంటే… ప్రతిపక్ష పార్టీగా వారి బాధ్యతను గడచిన ఐదేళ్లూ సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే. అసెంబ్లీకి వెళ్లి, ప్రభుత్వం తీరుపై అక్కడే చర్చించి ఉంటే… ఇంకా చర్చ జరగాలన్న అభిప్రాయం వారికి కూడా ఉండేది కాదు కదా. సమస్యలను ప్రజల్లోనే చర్చిస్తామంటూ అసెంబ్లీకి వైకాపా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టేసి మరీ పర్యటించారు. అంటే, పాదయాత్రలో ఆ చర్చను ప్రజల్లో పెట్టడంలో వైఫల్యం చెందినట్టే కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close