టీడీపీ నేతల చేతిలో దెబ్బలు తిన్న రాంబాబు కుటుంబాన్ని ఓదారుస్తానని జగన్ రెడ్డి గుంటూరు మొత్తం తిరిగి రాంబాబు నివాసానికి వెళ్లారు. ఆయన ఊరేగింపు చూసి .. అంబటి రాంబాబు కుటుంబం బాధ పడటం జగన్ రెడ్డికి ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఉందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అడ్డాకూలీలను సమీకరించి.. స్టేజ్ డ్రామాలతో ఆయన కారుచాలా నెమ్మదిగా గుంటూరు నగరంలో నుంచి అంబటి రాంబాబు ఇంటికి సాగింది. కారు ఏ సెంటర్ కు వెళ్లినా అక్కడ ఆయన చుట్టూ గుమికూడటానికి రెండు వందల మందిని రెడీగా ఉండేలా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్నారు.
అవసరం లేని తోపులాటలు.. క్లోజ్ షాట్లతో లైవ్ లు పెట్టుకుని యాత్ర కొనసాగించారు. అంబటి రాంబాబు ఇంటికి చేరుకునే సరికి మధ్యాహ్నం దాటిపోయింది. ఆయన ఊరేగింపు కోసం పార్టీ నేతలు చాలా ఖఱ్చు పెట్టుకోవాల్సి వచ్చింది. జగన్ రెడ్డి బయటకు వస్తే అసలు జనాలు ఎలా వస్తారో… తోలుకొచ్చేవాళ్లు ఎంత మందో అందరికీ తెలుసు. సీఎంగా ఉన్నప్పుడే ఆయన చేసిన బస్సు యాత్రలో పాల్గొనేందుకు డబ్బులు పెట్టి జనాల్ని తీసుకు రావాల్సి వచ్చింది.
తాను బయటకు వస్తే తన చుట్టూ తోసుకుంటూ జనాలు లేకపోతే జగన్ రెడ్డికి ఓ ఆత్మన్యూనతా భావం వెంటాడుతుంది. ఎవరూ తనను పట్టించుకోవడం లేదన్న భావనలో ఆయన ఉండిపోతారు. అందుకే ఎలాంటి పరామర్శనైనా మూడు, నాలుగు రోజుల ముందుగా షెడ్యూల్ చేసి… జనసమీకరణ.. టూర్ లో ఎప్పుడేం జరగాలో అన్నీ స్క్రిప్ట్ గా రాసుకుని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే బయలుదేరుతున్నారు.