అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం జగన్ నిరీక్షణ..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ అడిగి రెండు వారాలు దాటిపోయింది. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి విజయసాయిరెడ్డి ఈ విషయంలో..ఫుల్టైం పని చేస్తున్నారు.తన పలుకుబడిని ఉపయోగించి.. అమిత షా అపాయింట్‌మెంట్ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపు విషయంపై కేంద్రానికి ఓ మాట చెప్పాలనుకుంటున్నారన్న ప్రచారం.. మూడు వారాలుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్ ప్రకటన చేసిన తర్వాత… జీఎన్ రావు కమిటి రిపోర్ట్ ను..కేబినెట్‌లో ఆమోదించి..విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించి.. విశాఖకు వెళ్లాలనుకున్నప్పుడే… ఆయనకు అవాంతరాలు ఎదురయ్యాయి.

జీఎన్ రావు కమిటీ రిపోర్ట్ ను నేరుగా.. కేబినెట్‌లో ఆమోదించలేక… బోస్టన్ గ్రూప్ పేరు చెప్పి..తర్వాత ఆయన విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించడానికి విశాఖ వెళ్లారు. అప్పట్నుంచి.. ఏదో ఓ నివేదిక పేరు చెప్పి.. సమయం గడిచిపోతోంది కానీ.. ఇంకా అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. కానీ..అప్పట్నుంచి.. జగన్మోహన్ రెడ్డి.. అమిత్ షా.. సమయం కోసంచూస్తున్నారు. కానీ దొరకడం లేదంటున్నారు. ఇరవయ్యో తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టదల్చుకున్న విషయాన్ని బహిరంగంగా చెప్పిన తర్వాతకూడా.. జగన్ కుఢిల్లీ నుంచి పిలుపు అందలేదు. ఈ కారణంగానే… వాయిదాలు వేస్తున్నారా.. అన్న సందేహాలు కూడా వస్తున్నాయంటున్నారు. తాము తీసుకునే అన్ని నిర్ణయాలను.. కేంద్రానికి చెప్పే చేస్తున్నామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

నిజంగా చెబుతున్నారో లేదో కానీ… పీపీఏలు, పోలవరం వంటి అంశాల్లో… నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేంద్ర పెద్దల్ని విజయసాయి, బీజేపీ నేతలు కలిశారు. దీంతో కేంద్రానికి చెప్పారని అనుకున్నారు. దీంతో కేంద్రంపైనే విమర్శలొచ్చాయి. ఇప్పుడు అమిత్ షాను కలిసిన తర్వాత జగన్.. అమరావతిని తరలిస్తే…తాను కేంద్రానికి చెప్పే చేశానని జగన్ ప్రచారం చేసుకుంటారేమోనని.. బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని.. బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. మరి ఏది నిజమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జిల్లా విభజనకు వ్యతిరేకంగా ధర్మాన ..!

వైసీపీలో మరో అసంతృప్తి స్వరం మెల్లగా బయటకు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు .. శ్రీకాకుళం జిల్లాలను.. విభజించబోతున్నారన్న ప్రచారం నేపధ్యంలో హఠాత్తుగా వ్యతిరేక ప్రకటన చేశారు. శ్రీకాకుళం...

తెలంగాణ రాజకీయల్లో మళ్లీ ” సెక్షన్ 8″ ..!

సెక్షన్ 8 అంశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త కలకలం రేపుతోంది. పాత సెక్రటేరియట్‌ను కూల్చివేయడానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారా.. అనే ప్రశ్నతో.. కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. ఎందుకంటే.. హైదరాబాద్ పదేళ్ల...

ఓటీటీ వైపు చూస్తున్న కీర్తి సినిమాలు

ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైంది.. 'పెంగ్విన్‌'. కీర్తి సురేష్ న‌టించిన ఈసినిమాకి రివ్యూలూ, రేటింగులూ ఆశాజ‌న‌కంగా లేవు. కానీ... వ్యూవ‌ర్ షిప్ మాత్రం బాగానే వ‌చ్చింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల...

ఎస్‌ఈసీ విషయంలో మరోసారి ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ..!

అటు కనగరాజు.. ఇటు నిమ్మగడ్డ కాకుండా.. మూడో వ్యక్తిని ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నియమించేలా.. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు గండి పడింది. అధికారులు విధులు నిర్వహించలేకపోతున్నారని అందు...

HOT NEWS

[X] Close
[X] Close