ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్లను సీఐడీ సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో వారి పాత్ర ఏదైనా ఉంది అంటే జగన్ రెడ్డి తరపున పనులు చక్కబెట్టడం. సీఎంగా ఉన్నప్పుడు జగన్ సీఎంవో ఆఫీసు మొత్తం ధనుంజయ్ రెడ్డి చూస్తే.. ఓఎస్డీగా జగన్ వ్యక్తిగత వ్యవహారాలు కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నారు. ఫలితంగా వీరిద్దరికీ కాస్తంత కమిషన్ ఇచ్చారో ..వీరే కక్కుర్తి పడ్డారో లేకపోతే.. బినామీలుగా వాడుకోండి సార్ అని ఆఫర్ ఇచ్చేశారో కానీ..ఆశపడి దొరికిపోయారు. వీరు ఏం చేసినా అది జగన్ కోసమే కాబట్టి జగన్ ను సాంకేతికంగా అరెస్టు చేసినట్లే. అసలు అరెస్టు చాలా త్వరగానే ఉండే అవకాశం ఉంది.
ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు
జగన్ రెడ్డికి రెండు చేతుల్లా పని చేసి లిక్కర్ సొమ్మును బట్వాడా చేసి..తప్పుడు మార్గాల్లో పెట్టుబడులు పెట్టించి, కుటుంబసభ్యులతో కంపెనీలు పెట్టించి.. రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేయించిన వైనం సాక్ష్యాలతో సహా సీఐడీ సిట్ బయటకు తీసింది. అందుకే సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఎలా కళ్లు మూసుకుంటామని ప్రశ్నించింది. దీంతో వారి నిర్వాకం ఏమిటో స్పష్టమయిపోయింది. వాళ్లు చేసిన ఆ తప్పుడు పనులు చేసింది జగన్ రెడ్డి కోసం.. చేయించింది జగన్ రెడ్డి కోసం.
లిక్కర్ స్కామ్ సూత్రధారి వద్దకే కేసు !
ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి ఎలా దోచుకోవాలో మాస్టర్ ప్లాన్ వేసింది.. అధికారంలోకి రాగానే ఎగ్జిక్యూట్ చేసింది.. మహా దోపిడీ దారు. ప్రజలు ఇచ్చే అధికారం అంతా దోపిడీ చేయడానికేనని అనుకునే మనిషి. టైం వేస్ట్ అవుతుందని గెలవక ముందే ఎలా ఎలా ఎలా దోపిడీ చేసి.. ఎలా ఎలా డబ్బుల్ని రూటింగ్ చేయాలో ప్లాన్ వేసుకునే మహాముదురు. అది ఎవరో అందరికీ తెలుసు. దర్యాప్తు సంస్థలు పక్కా సాక్ష్యాలతో దీన్ని నిరూపించబోతున్నాయి. మద్యం స్కాంలో ఎన్ని వేల కోట్ల ఆయన బొక్కసానికి చేరాయో .. వివరించబోతున్నారు.
తప్పించుకోవడం అసాధ్యం !
జగన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని సాక్ష్యాల్లేని లిక్కర్ కేసు పెడుతున్నారని పేర్ని నాని లబలబలాడిపోయారు. సాక్ష్యాలు ఉన్నాయని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిన తర్వాతనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది వారి విపరీత ధోరణికి నిదర్శనం. ఎంత చేసినా.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వారిని సీఐడీ సిట్ పూర్తి సాక్ష్యాలతో బుక్ చేయబోతోంది.
ఇప్పుడు జగన్ రెడ్డి తరపున పనులు చక్కన బెట్టిన వారు అరెస్టు అయ్యారు. అసలు ఏ 1 త్వరలోనే తెరపైకి రానున్నారు. ఆయన చేసినా.. చేయించిన నిర్వాకాలేమిటో.. దేశ ప్రజలందర్నీ మరోసారి ఆశ్చర్యానికి గురి చేయనున్నాయి.