చైతన్య : జగన్‌లో స్పష్టంగా ఓటమి భయం !

అప్పట్ల ో వెంట్రుక కూడ పీకలేరని సవాల్ చేసిన సీఎం జగన్ డైలాగుల్లో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. పొత్తులనేవి రాజకీయ వ్యూహాల్లో భాగం. పొత్తులు పెట్టుకోవద్దని ఇతర పార్టీల్ని సవాల్ చేయడం అంటే… తమ ఓటమిని తాము ఒప్పుకోవడమే. కేంద్రంలో మోదీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూటమిని ఏర్పాటు చేసుకుంది. కానీ బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా రావాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేయలేదు. కూటమిగా పోటీ చేయడం వల్ల.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. మొత్తం వంద ఓట్లు ఉంటే.. యాభై ఒక్క ఓట్లు తెచ్చుకున్న వారికే గెలుపు రాదు. ఐదుగురు పోటీలో ఉండి.. ముగ్గురిరికి ఇరవై, ఒకరికి 19, మరొకరికి21 వస్తే .. 21 వచ్చిన వారిదే విజయం. మిగతా 79శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు కదా అనే లాజిక్ మన ప్రజాస్వామ్యంలో పని చేయదు. . అందుకే పొత్తులు పెట్టుకుంటాయి. ఓట్లు చీలిపోవడం ద్వారా గెలుస్తామని సీఎం అనుకోవడం వల్లనే ఇలా సవాల్ చేస్తున్నారని సహజంగానే చర్చ ప్రారంభమయింది.

కలిసి పోటీ చేయవద్దని చెప్పడం బేలతనమే !

మొదటి సారి చంద్రబాబు, పవన్ విజయవాడలోని ఓ హోటల్‌లో కలిసినప్పుడు ఎంత మంది కలిసి వచ్చినా సరే వార్ వన్ సైడే అని.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ప్రకటించారు. టీడీపీ, జనసేన అసలు విడిపోలేదని మొదటి నుంచి కలిసే ఉన్నాయన్నారు. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వైసీపీ నేతలు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. దీంతో రెండు పార్టీలను కలిపే విమర్శించడం ప్రారంభించారు. దీంతో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నదాన్ని వైఎస్ఆర్‌సీపీ పట్టించుకోవడం లేదని.. తమ ఓటు బ్యాంక్ తమకు ఉంటుందన్న ధైర్యంతో ఉందని అనుకుంటూ వచ్చారు.

పవన్ ను ఒంటరిగా పోటీ చేయించేందుకు ఎన్ని కుట్రలో !

అయితే అనూహ్యంగా ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలనే సవాల్ చేస్తూ వస్తున్నారు. టీడీపీతో కలిస్తే చంద్రబాబు సీఎం అవుతారని పవన్ సీఎం అవుతారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ టీడీపీతో కలుస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ, జనసేన కలిస్తే సీఎం ఎవరు అనే చర్చ కూడా పెట్టారు. . రెండు పార్టీలు ఇంకా అధికారికంగా ఎలాంటి పొత్తుల చర్చలు కూడా ప్రారంభించలేదు. జనసేన పార్టీ ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతోంది. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం.. ఆ పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. వైసీపీ నేతలూ నమ్ముతున్నారు. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు.

జగన్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఓటమి భయం !

అధికారంలోకి వచ్చి.. ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిన సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. అరాచక రాజ్యం స్థాపించారు. అభివృద్ధి అనే పదం లేకుండా చేశారు. ప్రజల జీవన ప్రమాణాల్ని దారుణంగా తగ్గించేశారు. ఇప్పుడు తాను పంచిన డబ్బులు తీసుకున్న వారు ఓట్లేస్తారన్న ఆశతో దింపుడు కళ్లెం సవాళ్లు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీ కలిస్తే గెలుపు కష్టమని నివేదికలు రావడం ద్వారానే జగన్ ఇలా సవాళ్లు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది నిజం కూడా !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

50 డేస్ : మిన్నంటుతున్న యువగళం !

యువగళం పాదయాత్ర యాభై రోజులయింది. కుప్పం నుంచి ప్రారంభించి పుట్టపర్తి నియోజకవర్గం వరకూ వచ్చారు. ఈ యాభై రోజుల్లోనే అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పట్టభద్రులు టీడీపీ వైపు ఉన్నట్లుగా తేలింది....

ఆర్కే పలుకు : ఈ వారం ఉచిత సలహాలు!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాల తర్వాత ఇక ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఏం రాస్తారోనని.. ఆయన మాటలకు హద్దులు ఉండవని అంచనాలు పెంచేసుకున్న వారికి ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే...

తిరుమలలో కూడా గంజాయి – ఇదీ ఏపీ పరిస్థితి !

తిరుమలలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి గంజాయి స్వాధీనం చేసుకోవడం అక్కడ పెద్ద ఎత్తున దందా జరుగుతోందని పోలీసులు గుర్తించడంతో శ్రీవారి భక్తులు నివ్వెర పోతున్నారు. ఎంతో పవిత్రంగా...

మ‌నోజ్ ద‌గ్గ‌ర ఇంకా వీడియోలు ఉన్నాయా?

మంచు ఇంట్లో... అన్నాద‌మ్ముల గొడ‌వ‌తో కాక పుట్టిన సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం మ‌నోజ్ ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో... విష్ణుతో త‌న‌కున్న విబేధాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. శుక్ర‌వారం అంతా ఇదే హాట్ టాపిక్‌....

HOT NEWS

css.php
[X] Close
[X] Close