జగన్ రెడ్డి అహంకారం ఎంత ఘోరంగా ఓడిపోయిందో అక్టోబర్ పదమూడో తేదీన మరోసారి ప్రజల ముందుకు రానుంది. అమరావతిని పీక పిసికి చంపేశానని ఆయన చేసిన వికటాట్టహాసాలు ..ఆయనను మరోసారి ఎగతాళి చేయబోతున్నాయి. ఆయన శిథిలం చేసిన సీఆర్డీఏ భవనం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రారంభానికి రెడీ అయింది. పదమూడో తేదీన చంద్రబాబునాయుడు ఆ భవనాన్ని ప్రారంభించనున్నారు.
సీఆర్డీఏ కార్యకలాపాల కోసం ఆ భవనాన్ని జీ ప్లస్ సెవన్ గా టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించారు. శ్లాబులు పూర్తయి.. ఇంటీరియర్ జరగాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. ఐదేళ్ల పాటు ఆ భవనాన్ని ఎలా పనికి రాకుండా చేయాలో చూసి మరీ అలా కొద్ది కొద్దిగా పనులు చేయించారు. లిఫ్ట్ పెట్టకుండా ప్లాన్లు మార్చి పనులు చేశారు. అయినా ఆ భవనాన్ని ఉపయోగంలోకి తేలేకపోయారు. ప్రభుత్వం మళ్లీ మారడంతో ఏడాదిలోనే పూర్తి చేశారు.
భవనాన్ని చెడగొట్టినప్పటికీ.. మళ్లీ కాంట్రాక్టర్ ను పరుగులు పెట్టించి…మొత్తం మార్చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో భవనం సిద్ధం అయింది. సీఆర్డీఏ, మున్సిపల్ శాఖలకు సంబంధించిన వ్యవహారాలన్నీ అక్కడి నుంచే సాగనున్నాయి. వాటర్ , ఎనర్జీ ఇలా అన్ని అంశాల్లో పర్యావరణ హితంగా రూపొందించారు. బడా కార్పొరేట్ కార్యాలయాలకు మరిపించే విధంగా.. అమరావతి నిర్మాణాన్ని అక్కడి నుంచే నిరంతరం పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతికతతో సిద్ధమయింది.
ఈ భవనం ప్రారంభం రోజున జగన్ రెడ్డికి నైతికంగా మరో ఘోరమైన ఓటమి ఎదురవుతుంది. తాను చేసిన విధ్వంసం నుంచి ఫీనిక్స్ లా ఎదుగుతున్న అమరావతిని చూసి ఆయన సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.