కేటీఆర్‌కు జగన్ ఫోన్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసి పంపించిన 1,250మంది ఉద్యోగుల విషయమై వీరిద్దరిమధ్య సంభాషణ చోటుచేసుకుంది. వీరు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారుకావటంతో కేసీఆర్ ప్రభుత్వం రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం తీసుకోక ఇటు తెలంగాణ ప్రభుత్వం వద్దనటంతో వీరి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. మూడునెలలనుంచి జీతాలులేక వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎమ్ రమేష్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రమేష్‌కు వ్యక్తిగతంగా జగన్‌తో సాన్నిహిత్యం ఉండటంతో ఆయన జగన్‌కు ఫోన్ చేసి విద్యుత్ ఉద్యోగుల సమస్యను వివరించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడాలని, విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించేటట్లు చూడాలని కోరారు. దానికి జగన్ సమ్మతించటంతో విద్యుత్ ఉద్యోగులు ఆయనను కలిశారు. జగన్ ఈ విషయమై కేసీఆర్‌ను కాకుండా ఆయన తనయుడు కేటీఆర్‌ను సంప్రదించారు. ఈ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈమేరకు లేఖకూడా రాశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు మంత్రి కేటీఆర్‌నుకూడా కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. కేటీఆర్ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి వేతనాలు చెల్లించొద్దని ఆదేశించినందున తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కేటీఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ త‌రుణ్‌పై బెదిరింపు బాణం

రాజ్ త‌రుణ్ - లావ‌ణ్య వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసులో రాజ్ త‌రుణ్ అంత‌కంత‌కూ కూరుకుపోతున్నాడే త‌ప్ప‌, పైకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. తాజాగా లావ‌ణ్య రాజ్ త‌రుణ్‌కు...

ర‌వితేజ‌.. బాబీ.. మ‌రోసారి

ర‌వితేజ `ప‌వర్‌`తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు బాబీ. ఆ త‌ర‌వాత మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్స్ గా నిలిచాడు. చిరంజీవితో తీసిన 'వాల్తేరు వీర‌య్య‌' పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు నంద‌మూరి...

ప్ర‌భాస్ @ రూ.200 కోట్లు!

తెలుగు హీరో నుంచివ‌ పాన్ వ‌ర‌ల్డ్ స్టార్ గా ఎదిగాడు ప్ర‌భాస్. ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. ప్ర‌భాస్ క్యాలిబ‌ర్‌కీ, స్టామినాకీ 'క‌ల్కి' ఓ నిద‌ర్శ‌నంలా మారింది. ఈ సినిమా రూ.1000 కోట్ల...

బీజేపీలోకి హరీష్ రావు.. ఈటల హింట్?

బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్ , హరీష్ రావుల ఇటీవలి ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కవితకు బెయిల్ కోసమే ఈ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళారని, అదే సమయంలో రాష్ట్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close