తాను బయటకు వెళ్తే కుప్పలు తెప్పలుగా జనం వచ్చి దండాలు పెట్టేస్తారని నిరూపించుకునేందుకు జగన్ రెడ్డి పడుతున్న పాట్లు, చేసుకుంటున్న స్కిట్లతో ప్రజల ప్రాణానికి వస్తోంది. తుఫాన్ ముగిసిన వారానికి ..అన్నీ సెట్ చేసుకుని పరామర్శ పేరుతో బయలుదేరి ఆయన రోడ్లపై చేస్తున్న షో దెబ్బకు జాతీయ రహదారిపై జామ్ అయిపోయింది. పోలీసుల ఆంక్షలు పట్టించుకోరు.. సూచనలు లెక్క చేయరు. అరాచకంగా వ్యవహరించడమే తమ విధానమన్నట్లుగా వారి తీరు ఉంది.
ఇప్పుడు ఎన్నికలు లేవు. రోడ్ షోలు అవసరం ఏమిటో వారికే తెలియాలి. రోడ్ షో చేయడానికి అనుమతి అయినా తీసుకోవాలి. అలాంటిదేమీ ఉండదు. పార్టీ నేతలకు టార్గెట్లు ఇచ్చి మరీ జిల్లాల నుంచి పక్కల జిల్లాల నుంచి కార్యకర్తలను తీసుకు వచ్చి వారితో మోకాళ్ల దండాలు వేయించడం దగ్గర నుంచి అరాచకంగా ప్రవర్తించడం వరకూ అన్నీ చేయిస్తారు. మధ్యలో ప్రజలు మాత్రం నానా తిప్పలు పడుతూంటారు. చివరికి అంబులెన్స్ లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి.
రైతుల్ని పరామర్శించడానికి పెడనకు వెళ్లాలనుకున్నప్పుడు నేరుగా రైతుల వద్దకు వెళ్లాలి. కానీ జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయడానికి వెళ్తున్నా అంటే.. తన కోసం ప్రజలంతా ఎగబడి వస్తారని ఎవరికో నిరూపించాలనుకుని షో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీని వల్ల ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. దేశంలో చాలా మంది నేతలు ర్యాలీలు చేస్తారు.. పరామర్శలకు వెళ్తారు కానీ.. జగన్ రెడ్డిలా.. ఎంత అరాచకం చేస్తే అంత బలం ఉందని అనుకుంటారనేలా.. సైకోతనంతో వ్యవహరించడం మాత్రం వైసీపీ నేతలకే చెల్లింది.
