తెలుగు సినిమాలోని విలన్ల కొరత గురించి తెలుసుకొన్న జగపతిబాబు…. జగ్గూభాయ్‌గా మారిపోయి… ఆలోటు కొంత వరకూ తీర్చాడు. విలన్ గా మారాలని ఎప్పుడైతే అనుకొన్నాడో అప్పుడే జగపతి బాబు కెరీర్ గ్రాఫ్ కూడా అమాంతం మారిపోయింది. ఇది వరకు జగపతిబాబుని పట్టించుకోనివాళ్లు.. ఇప్పుడు ఆయన కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. హీరోగా వంద సినిమాలు చేసినా రాని క్రేజ్, పెరగని బ్యాంకు బ్యాలెన్స్ విలన్‌గా సంపాదించుకొన్నాడు. అంత వరకూ బాగానే ఉంది. కానీ.. ఒకే ఒక్క విషయంలో జగ్గూభాయ్ ప్రేక్షకుల్ని విసిగిస్తున్నాడు. అదే.. అతని గెటప్.
లెజెండ్‌లో మెరిసిన జుట్టుతో కనిపించాడు జగ్గూభాయ్. అప్పటికి ఆ లుక్ కొత్తగా అనిపించింది. పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, కరెంట్ తీగ, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు.. ఇలా మొదలెట్టి అన్ని సినిమాల్లోనూ అదే గెటప్. మెరిసిన గెడ్డం ఉంటే తప్ప స్టైలీష్ లుక్ రాదన్న భ్రమల్లో ఉన్నట్టున్నాడు జగ్గూభాయ్. ఆఖరికి మొన్నొచ్చిన ఇజంలోనూ సేమ్ టూ సేమ్ లుక్ కంటిన్యూ చేశాడు. ఈలోగా జగపతి కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో నటించాడు. అక్కడే సేమ్ ఇదే గెటప్ లో కనిపించాడు. ఇప్పుడు చేతుల్లో ఉన్న సినిమాల్లోనూ అదే ఓల్డ్ లుక్. ఒకటీ, రెండు సినిమాల్లో అంటే ఓకే. ఇక ప్రతీ సినిమాలోనూ అదే లుక్‌లో ఉంటానంటే ఎలా?? రొటీన్ హీరోయిజంతో అప్పట్లో బోర్ కొట్టించి, తన కెరీర్ పాడు చేసుకొన్న జగ్గూభాయ్.. ఇప్పుడు విలన్ గానూ అదే తప్పు చేస్తున్నాడేమో అనిపిస్తోంది. జగపతి బాబు పోస్టర్ బయటకు వస్తే…అది ఏ సినిమాలోనిదే చెప్పలేని పరిస్థితి వచ్చిందిప్పుడు. ఇక మీదటా.. ఇదే లుక్‌తో కనిపిస్తే.. జగ్గూభాయ్ కనిపించగానే ఆడియన్స్ బాబోయ్ అని పారిపోవడం ఖాయం. ఈ విషయాన్ని ఈ బాబు… ఎంత త్వరగా తెలుసుకొంటే అంత మేలు.