కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఐదారుగురు ఎమ్మెల్యేల్లో.. ఒకరైన తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి… టీఆర్ఎస్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా.. అన్న ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. తనను ఎవరూ పిలవలేదని… గతంలో.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలిస్తేనే..కాంగ్రెస్ పార్టీలో చేరానని.. అడిగిన వారికి.. అడగని వారికీ చెబుతున్నారు. ఇప్పుడు.. తనను టీఆర్ఎస్ లోకి రావాలని ఎవరూ ఆహ్వానించడం లేదంటున్నారు. అప్పట్లో సంగారెడ్డి అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లానని..సంగారెడ్డికి ఐఐటీ, ఎడ్యుకేషన్ సంస్థలు తీసుకొచ్చి అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గ ప్రజల కోసమే నిర్ణయాలుంటాయని చెబుతూ.. టీఆర్ఎస్ నుంచి ఏ మాత్రం పిలుపు వచ్చినా.. చేరిపోవడానికి సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు.
టీఆర్ఎస్ ఇప్పుడు… కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్ లోవిలీనం చేయాలనే పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ తరపున గెలిచిన 19 మందిలో.. పదకొండు మంది ఇప్పటికే…గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ సమావేశాల నాటికి..విలీన ప్రక్రియ పూర్తి చేయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. విలీనం ప్రక్రియ సాఫీగా సాగాలంటే… టీఆర్ఎస్ కు మరో ఇద్దరు ఎమ్మెల్యేల అవసరం. అందుకే..జగ్గారెడ్డి… త్వరపడుతున్నట్లుగా కనిపిస్తోంది. తాను సిద్ధంగా ఉన్నారని.. పిలుపు రావడమే తరువాయని చెబుతున్నారు. కొద్ది రోజులుగా జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అందుకే.. టీఆర్ఎస్ హైకమాండ్ మనసు గుర్తించి.. సంగారెడ్డి సమస్యలకు హరీష్ రావును బాధ్యుడ్ని చేసేప్రయత్నం చేశారు. హరీష్ పై విమర్శలు గుప్పిస్తూ..కేసీఆర్ మంచోడంటున్నారు.
నిజానికి జగ్గారెడ్డి…మొదట్లో బీజేపీలో ఉండేవారు. ఆలె నరేంద్ర శిష్యుడిగా రాజకీయం చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్లి.. మొదట్లో ఆ పార్టీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడేవారు. వైఎస్ రెండో సారి గెలిచినప్పుడు..తాను కూడా రెండో సారి గెలిచారు. కానీ ఆ తర్వాత రాజకీయం మారిపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్ గూటికిచేరేందుకు తహతహలాడుతున్నారు.