స్టార్ హీరో సినిమా అంటే స్క్రిప్టు విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిందే. అందుకోసం నెలలు, సంవత్సరాలు కష్టపడుతుంటారు దర్శకులు, రచయితలు. అయితే `జై లవకుశ` సినిమా స్క్రిప్టు దాదాపు నెల రోజుల్లో పూర్తి చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ స్వయంగా వెల్లడించారు. ఫస్టాఫ్ 15 రోజుల్లో, సెకండాఫ్ 16 రోజుల్లో ఫినిష్ అయ్యిందట. ఎన్టీఆర్ సినిమాకు ఇంత ఫాస్ట్ గా స్క్రిప్టు పూర్తి చేయడం ఇదే తొలిసారేమో? ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించిన సినిమా అది. కమర్షియల్ గా బాగానే ఆడింది.
జై లవకుశ స్క్రిప్టు ఇంత త్వరగా పూర్తి అవ్వడం వెనుక క్రెడిట్ ని కోన వెంకట్ కే ఇచ్చారు బాబీ. ఆసినిమా స్క్రిప్టు విషయంలో కోనది ప్రధాన పాత్ర. ‘అదుర్స్’ సినిమాకు కోన వెంకట్ రచయిత. ఆటీమ్ లో బాబీ కూడా ఉన్నారు. బాబీ దర్శకుడయ్యాక కోన వెంకట్ తో పని చేయడం ‘జై లవకుశ’ తోనే. అలా.. వారిద్దరి మధ్య ట్యూన్ కుదిరింది. అందుకే ఎన్టీఆర్ కథని అంత ఫాస్ట్ గా పూర్తి చేయగలిగారు. బాబి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకూ కోననే రచయిత. మరి ఈ స్క్రిప్టుని ఇంకెంత త్వరగా పూర్తి చేస్తారో..?
ఏప్రిల్ తొలి వారంలో చిరు సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈలోగా టైటిల్, మిగిలిన వివరాలు రివీల్ చేస్తారు.
