‘జై ల‌వ‌కు’శ‌.. ఫ్లేవ‌ర్ మారిందేంటి??

‘జై ల‌వ‌కుశ‌’లోని మూడు పాత్ర‌ల్లోని జై నెగిటీవ్ రోల్ అని తేలిపోయేస‌రికి ర‌క‌ర‌కాల క‌థ‌లు, క‌థ‌నాలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈ ముగ్గురూ అన్న‌ద‌మ్ములనీ, చిన్న‌ప్పుడే విడిపోతార‌ని, ఎక్క‌డెక్క‌డో పెరిగి పెద్ద‌వాళ్ల‌వుతారని, జై… త‌న ఎదుగుద‌ల కోసం మిగిలిన ఇద్ద‌ర్నీ వాడేసుకొంటాడ‌ని, చివ‌ర్లో చ‌నిపోతాడ‌ని.. ఇలా ‘జై ల‌వ‌కుశ‌’ క‌థ గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొన్నారు. అయితే.. `జైలవ‌కుశ‌` ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లో ఎన్టీఆర్ మాట‌లు చూస్తుంటే.. ఈ సినిమా మ‌రో క‌ల‌ర్‌లో సాగే అవ‌కాశాలున్న‌ట్టు అర్థం అవుతోంది. ‘ల‌వ‌కుశ‌’లా ‘జై ల‌వ‌కుశ‌’ కూడా అన్న‌ద‌మ్ముల అనుబంధాన్ని చాటి చెప్పే సినిమా అట‌!

ఇక్క‌డ ‘అనుబంధం’ అనే మాట ఏ అర్థంలో వాడాడో తెలీదు గానీ – ఇప్ప‌టి వ‌ర‌కూ సర్కిల్ అవుతున్న క‌థ కీ, అస‌లు క‌థ‌కీ సంబంధం లేదేమో అనిపించేలా ఉన్నాయి ఎన్టీఆర్ మాట‌లు. ఒకొక్క పాత్ర‌లోనూ రెండు మూడు షేడ్స్ ఉండబోతున్నాయేమో..? ఎవ‌రు విల‌నో, ఎవ‌రు హీరోనో చివ‌రి వ‌ర‌కూ చెప్ప‌లేమేమో అనిపిస్తోంది. ‘జై’ని విల‌న్ అనుకొని థియేట‌ర్లోకి అడుగుపెట్టేవాళ్ల‌కు.. షాకిచ్చే విష‌యం ఏదో సినిమాలో ఉండే ఉంటుంది. అదే నిజ‌మైతే… ‘జై ల‌వ‌కుశ‌’ వెండి తెర‌పై మ‌రింత థ్రిల్ చేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌థ‌లు వింటున్న త్రివిక్ర‌మ్‌

స్వ‌త‌హాగా త్రివిక్ర‌మ్ మంచి ర‌చ‌యిత‌. ఆ త‌ర‌వాతే ద‌ర్శ‌కుడ‌య్యాడు. త‌న క‌థ‌ల‌తోనే సినిమాలు తీశాడు. తీస్తున్నాడు. `అ.ఆ` కోసం ఓ న‌వ‌ల ని ఎంచుకున్నాడు. ర‌చ‌యిత్రికి కూడా క్రెడిట్స్ ఇచ్చాడు. అయితే.. క‌థ‌ల...

ఆత్మ‌క‌థ రాస్తున్న బ్ర‌హ్మానందం

అరగుండుగా `అహ‌నా పెళ్లంట‌`లో న‌వ్వించాడు బ్ర‌హ్మానందం. అది మొద‌లు.. ఇప్ప‌టి వ‌ర‌కూ వంద‌లాది చిత్రాల్లో హాస్య పాత్ర‌లు పోషించి, తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. ప‌ద్మ‌శ్రీ‌తో ప్ర‌భుత్వం...

క‌మ్ బ్యాక్ కోసం నిత్య‌మీన‌న్ ఆరాటం

అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్పుడే ఒడిసిప‌ట్టుకోవాలి. అవి చేజారిపోయాక‌.. ఆరాట‌ప‌డ‌డంలో అర్థం లేదు. చిత్ర‌సీమలో అవ‌కాశ‌మే గొప్ప‌ది. దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటామ‌నే విష‌యంపైనే కెరీర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ సంగ‌తి నిత్య‌మీన‌న్‌కి ఇప్పుడిప్పుడే...

గీతా ఆర్ట్స్‌లో వైష్ణ‌వ్ తేజ్‌

గీతా ఆర్ట్స్‌కీ, మెగా హీరోల‌కూ ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమాని బ‌య‌టి బ్యాన‌ర్‌లో చేయించి, రెండో సినిమా కి మాత్రం గీతా ఆర్ట్స్ లో లాక్ చేస్తుంటారు. రామ్ చ‌ర‌ణ్ అంతే....

HOT NEWS

[X] Close
[X] Close