పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకెళ్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఏర్పాటు చేసిన వ్యాపార సామ్రాజ్యానికి వారుసుడిగా ఉన్నారు. గతంలో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నా… నేరుగా లంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలు మాత్రం రాలేదు. ఇప్పుడే జగన్ రెడ్డి కారణం ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు పోతున్నాడు.
లంచాలు తీసుకుని వాటిని తన కంపెనీ ఖాతాల్లోకి మళ్లించడం అంటే… తమను ఎవరూ ఏమీ చేయలేరని ఓ మాయలో ఉన్నారని అనుకోవచ్చు. పీఎల్ఆర్ సంస్థలోకి కోట్లకు కోట్లు సూట్ కేసు కంపెనీల ద్వారా జమ చేయించి తర్వాత దొరికిపోతామని వేరే కంపెనీకి మళ్లించారు. మళ్లీ నగదు రూపంలో తీసుకున్నారు. ఇలా ఎన్నో లీలలు చేశారు. ఇప్పుడు దొరికిపోయారు. నెలకు రూ.ఐదు కోట్లు చొప్పున మిథున్ రెడ్డి సర్వీస్ కు ప్రతిఫలంగా జగన్ ఇచ్చారు. ఇక డిస్టిలరీలు ..ఇతర వ్యవహారాల గురించి చెప్పాల్సిన పని లేదు.
జగన్ రెడ్డి వేసే చిల్లర కోసం ఆశపడి జైలుకు వెళ్తున్న వారిలో మిథున్ రెడ్డితో ఎన్నో నెంబరో ఊహించడం కష్టం. ఆయన క్విడ్ ప్రో కో ప్రారంభించినప్పటి నుండి ఎన్నో జీవితాలు జైలు పాలయ్యాయి. ఆ విషయం తెలుసుకోక ఎంతో మంది తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ చుట్టూ చేరి జైళ్లకు వెళ్తున్నారు. జగన్ ను నమ్ముకుంటే.. తన దోపిడీలో భాగం చేసి జైలు పాలు చేస్తున్నారు. కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇది నిలబడే కేసు కాదని మిథున్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. కొన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వస్తానని అనుకుంటున్నారు. కానీ దోపిడీలకు భారత ప్రజాస్వామ్యం లైసెన్స్ ఇచ్చేసిందని అనుకుంటే పొరపాటే. భారత రాజ్యాంగం ఎప్పుడూ ఫెయిల్ కాదు. ప్రజలు కూడా ఎప్పుడూ ఫెయిల్ కారు. ఆ విషయం అర్థం కాకపోతే.. ఎప్పటికీ జైలు గతే అవుతుంది.