ఆస్కార్ బ‌రిలో ‘జ‌ల్లిక‌ట్టు’

ఆస్కార్స్ అవార్డుల కోసం ప్ర‌తీ యేటా.. భార‌త‌తీయ చ‌ల‌న చిత్ర రంగం నుంచి ఓ అఫీషియ‌ల్ ఎంట్రీ వెళ్తుంది. ఈసారి ఆ ఘ‌న‌త‌.. `జ‌ల్లిక‌ట్టు`కి ద‌క్కింది. 2019లో విడుద‌లైన ఈ మ‌ల‌యాళ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈసారి ఆస్కార్ బ‌రిలో అర్హ‌త కోసం 27 సినిమాలు పోటీ ప‌డ్డాయి. అందులో ఛాలాంగ్‌, శకుంతాలాదేవి, గుంజన్ స‌క్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో లాంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. అన్ని అంశాల‌ను సునిశితంగా ప‌రిశీలించిన మీద‌ట‌… జ‌ల్లిక‌ట్టును జ్యూరీ నామినేట్ చేసింది.

ఓ అడ‌వి దున్న నేప‌థ్యంలో సాగే క‌థ జ‌ల్లిక‌ట్టు. మ‌నిషిలోని అత్యాస‌కి, స్వార్థానికి ప్ర‌తినిధిగా క‌నిపిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగానే కాదు, టేకింగ్ విష‌యంలోనూ ఈచిత్రానికి మంచి మార్కులు ప‌డ్డాయి. సౌండ్ క్వాలిటీ సైతం అబ్బుర ప‌రుస్తుంది. ఇన్ని ల‌క్ష‌ణాలు ఉన్నాయి క‌నుకే.. ఇప్పుడు ఆస్కార్ బ‌రిలో నిలిచింది. ఈ చిత్రం తెలుగులోనూ డ‌బ్ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజయసాయిపై చెప్పులదాడి కేసులో కళావెంకట్రావు అరెస్ట్..!

రామతీర్థం ఘటనలో తనపై దాడి జరిగిందని దానికి కారణం చంద్రబాబు, అచ్చెన్న, కళా వెంకట్రావు అంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు శరవేగంగా స్పందించారు. ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా...

కేటీఆర్‌ని కాదు దళితుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలట..!

టీఆర్ఎస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతూండటంతో ఆ పార్టీతో మైండ్ గేమ్ ప్రారంభించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. కేటీఆర్‌పై ఇతర నేతల్లో అసంతృప్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఆయన సీనియర్...

వాల్తేర్ క్లబ్‌ స్వాధీనానికి హైకోర్టు బ్రేక్..!

విశాఖ వాల్తేరు క్లబ్ భూముల వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా క్లబ్‌ను స్వాధీనం చేసుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో కీలక భాగాన్ని అందులో ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ప్రయత్నాలుక హైకోర్టు...

పోలీసులకు వైసీపీ ఎమ్మెల్యే తిట్లు వినిపించలేదా ? : జేసీ

ఎస్పీని తిట్టినా.. హెచ్చరించినా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై చిన్న కేసు పెట్టకపోవడం... చివరికి చిన్న చిన్న విషయపై పెద్ద పెద్ద లేఖలు రాసే పోలీసు అధికారుల సంఘం కూడా స్పందించకపోవడంతో......

HOT NEWS

[X] Close
[X] Close