అసెంబ్లీ బయట ప్రతిపక్ష పాత్రలో జనసేన..!

ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ.. పవన్ కల్యాణ్ అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే.. ప్రజాసమస్యలపై .. బయటే తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారు. ఈ సెషన్‌లో ఆయన రైతు సమస్యలను తలకెత్తుతున్నారు. ధాన్యం రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో.. ఆయన ఆ సమస్యను టేకప్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులకు మద్దతుగా సదస్సు నిర్వహించిన ఆయన … గురువారం… దీక్షకు సిద్ధమయ్యారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేయబోతున్నారు. ఉభయగోదావరి జిల్లాలో ఏటా ఇరవై ఐదు లక్షల క్వింటాళ్ల వరి పండుతోంది. కానీ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు.

ప్రభుత్వం సేకరిస్తున్నప్పటికీ.. డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ధాన్యం ఇచ్చిన మూడు రోజులకే రైతుల ఖాతాలో డబ్బు వేస్తామని ప్రకటించారు. కానీ మాట తప్పారు. ఇప్పటి వరకూ రైతులకు డబ్బులు అందలేదు. రైతులు పవన్ కల్యాణ్‌కు మొర పెట్టుకోవడంతో.. వారి కోసం దీక్ష చేయాలని పవన్ కల్యాణ్ డిసైడయ్యారు. పవన్ కల్యాణ్.. ఎమ్మెల్యేగా గెలవకపోయినా… అసెంబ్లీ జరుగుతున్న సమయంలో.. చాలా ప్రభావవంతంగా.. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసెంబ్లీ బయటే ప్రజా సమస్యలను చర్చకు పెడుతున్నారు. అసెంబ్లీలో జనసేన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. దీంతో జనసేన వాయిస్‌ను.. ప్రజల కోసం పోరాటాన్ని.. ప్రజల మధ్యనే పవన్ కల్యాణ్ చేస్తున్నారు. ఆరు శాతం ఓట్లు వచ్చిన ప్రతిపక్ష పార్టీగా.. తన స్థానానికి పవన్ న్యాయం చేస్తున్నారు. కాకినాడ దీక్షను భారీగా నిర్వహించి.. ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా… ప్రభుత్వాన్ని కదిలించగలనని.. నిరూపించాలని పవన్ పట్టుదలగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేరళ ఎయిర్‌పోర్టులో విమానం రెండు ముక్కలు..!

కేరళలోని కోజికోడ్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో..విమానం స్కిడ్ అయి రెండు ముక్కలు అయింది. ఓ ముక్క చాలా దూరంగా పడిపోయింది. మరో ముక్క రన్ వే పై ఉండిపోయింది....

రికవరీ తక్కువ.. మృతులు ఎక్కువ..! ఏపీలో “డెడ్లీ” కరోనా..!

ఏపీలో కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కరోనాతో 89 మంది చనిపోయారు. కేసులు కూడా.. మరోసారి పదివేలకు పైగా నమోదయ్యాయ. దీంతో ఏపీలో కరోనా బారిన...

మూడు నెలల్లో కొత్త జిల్లాల విభజన సిఫార్సులు..!

మూడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల సందడి ప్రారంభమవనుంది. గత కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు..రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు...

జేసీ ప్రభాకర్ రెడ్డి అండ్ సన్ మళ్లీ అరెస్ట్..!

గురువారం సాయంత్రమే కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. పాత కేసులేవీ అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో... ...

HOT NEWS

[X] Close
[X] Close