ఆ విషయంలో పీఆర్పి తో పోలిస్తే జనసేన బెటరా?

2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. చిరంజీవి పార్టీని స్థాపించిన కొత్తలో విపరీతమైన ఊపు, హైప్ క్రియేట్ అయ్యాయి. అయితే సరిగ్గా 2009 ఎన్నికలకు 8 నెలల ముందు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడం, చిరంజీవి రాజకీయ తెర నుంచి నిష్క్రమించడం జరిగిపోయాయి. అయినప్పటికీ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ గురించి మాట్లాడేటప్పుడంతా ప్రజారాజ్యం ప్రస్తావన అనివార్యంగా వస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీ , ప్రజారాజ్యం తో పోలిస్తే ఏ విధంగా ఉంది అన్న విశ్లేషణ ప్రజల్లో నడుస్తోంది. అయితే మిగతా విషయాలన్నీ ఏ విధంగా ఉన్నప్పటికీ, కొన్ని విషయాలలో మాత్రం జనసేన ప్రజారాజ్యం తో పోలిస్తే బెటర్ గా ఉంది అని చాలామంది విశ్లేషిస్తున్నారు.

2009 ఫిబ్రవరిలో ప్రజారాజ్యం తిరోగమనంలో ఉంది:

ప్రజారాజ్యం పార్టీ విపరీతమైన హైప్ తో స్టార్ట్ అయింది. అదేవిధంగా చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలో అన్ని పార్టీల నుంచి పెద్ద పెద్ద లీడర్లు , రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మంత్రులుగా పనిచేసిన వారు, గవర్నర్లు గా పనిచేసిన వారు ప్రజారాజ్యంలో చేరారు. దీంతో పార్టీ విపరీతంగా బలోపేతం అయిందని పార్టీ స్థాపించిన మొదటి మూడు నాలుగు నెలలు అనిపించింది. అయితే 2008 ఆగస్టు నెలాఖరులో స్థాపించిన పార్టీకి తిరోగమనం అదే ఏడాది డిసెంబర్ కల్లా మొదలైంది. 2009 ఫిబ్రవరి నాటికి పార్టీలోకి కొత్తగా వచ్చే వారికంటే పార్టీ నుంచి వెళ్లిపోయే వారే ఎక్కువగా ఉండేవారు. పైగా పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి మీద అత్యంత తీవ్ర విమర్శలు చేసి వెళ్లిపోయారు. ఉదాహరణకి కేసినేని నాని ( ప్రస్తుతం టిడిపి తరఫున విజయవాడ ఎంపీ) ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటికి వెళ్ళి పోతూ, చిరంజీవి కి 2500 కోట్లు సంపాదించాలని లక్ష్యం ఉందని, ఆ లక్ష్యం కోసమే పార్టీని స్థాపించారని వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీలోకి వచ్చిన చాలామంది లీడర్లు ప్రజారాజ్యం లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు కూడా ఆ పార్టీపై తీవ్రంగా ప్రభావం చూపాయి.

అయితే జనసేన విషయంలో, ఈ పరిస్థితి కనిపించడం లేదు. 2009 ఫిబ్రవరిలో ప్రజారాజ్యం పరిస్థితితో పోలిస్తే, 2019 ఫిబ్రవరిలో జనసేన పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది పెద్ద లీడర్లు జనసేన పార్టీ లోకి చేరుతామని దాదాపు ఆరు నెలల కిందటే పవన్ తో చెప్పినప్పటికీ, పవన్ వారిని సరైన సమయంలో చేర్చుకుంటానని హామీ ఇచ్చి సరిపెట్టారు. ప్రజారాజ్యం అనుభవం కారణంగానే తొందరపడి నాయకులను పవన్ కళ్యాణ్ చేర్చుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

క్యాడర్ విషయంలో జాగ్రత్త పడ్డ జనసేనాని:

అంతే కాకుండా, ప్రజారాజ్యం చేసిన మరొక తప్పిదం, క్యాడర్ ని బిల్డ్ చేసుకోకుండా కేవలం లీడర్లపై ఆధారపడడం. దీంతో లీడర్లు రావడంతోటే వచ్చిన క్యాడర్ అదే లీడర్లు వెళ్లిపోవడంతో వారితో పాటే వెళ్ళిపోయింది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ జనసేన విషయంలో- లీడర్ లతో పాటు వచ్చే క్యాడర్ కంటే కూడా, తన మీద నమ్మకంతో ఉండే క్యాడర్ కోసం ప్రయత్నించారు. ఆ కారణంగానే పార్టీని గత నాలుగేళ్ల పాటు వన్ మ్యాన్ షో గా నడిపారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో కానీ, అటు బయట కానీ మద్దతుగా నిలుస్తున్న వారంతా కేవలం పవన్ కళ్యాణ్ కారణంగా ఆ పార్టీకి మద్దతిస్తున్న వారు. లీడర్లుగా ఎవరు వచ్చినా ఎవరు పోయినా, తనతో పాటు నిలిచి ఉండే ఒక క్యాడర్ పవన్ కళ్యాణ్ నిర్మించుకో గలిగారు.

మీడియా మేనేజ్మెంట్:

2009 ఫిబ్రవరి సమయానికి, ప్రజారాజ్యం అభిమానులు న్యూస్ ఛానళ్లు చూడాలంటేనే బెదిరిపోయే వారు. ఏ ఛానల్ పెడితే ప్రజారాజ్యానికి వ్యతిరేకంగా ఏ కథనం వస్తుందోనన్న భయమే దానికి కారణం. ఇటు తెలుగుదేశం అనుకూల మీడియా లో, అటు సాక్షి లో వచ్చిన కథనాలు అప్పట్లో ప్రజారాజ్యం అభిమానులకు నిద్ర లేకుండా చేశాయి. జనసేన విషయంలో ఇప్పుడైతే ఏ ఒక్క మీడియా కూడా నెగటివ్ కథనాలు వేసే సాహసం చేయడం లేదు. ఒకరిద్దరు కొంత ఉత్సాహ పడి జనసేన మీద “స్టింగ్” ఆపరేషన్ల వంటివి మొదలుపెట్టినా, దానికి వారే కొంత మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా కారణంగా జనసేనకు వచ్చిన బలం దానికి కారణం. పవన్ కళ్యాణ్ కూడా తనకు వ్యతిరేకంగా కథనాలు రాసిన మీడియా చానెళ్లపై చేసిన యుద్ధం కారణంగా అలాంటి కథనాలు రాయాలనుకున్నవారు కూడా సైలెంట్ అయిపోయారు. చివరికి వచ్చేసరికి ఎలాగూ ఈ చానల్స్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తాయి అన్న ముందు చూపుతోనే పవన్ కళ్యాణ్ తానే వాళ్లకు ముందే ఝలక్ ఇచ్చి ఉండొచ్చు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మొత్తం మీద:

మొత్తం మీద చూస్తే, ఈ మూడు విషయాల్లో కూడా ప్రజారాజ్యం తో పోలిస్తే జనసేన కాస్త బెటర్ గా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటేమో, 2009 ఫిబ్రవరి నాటికి తిరోగమనంలో ఉన్న ప్రజారాజ్యం పరిస్థితి తో పోలిస్తే జనసేన పరిస్థితి ప్రస్తుతానికి బెటర్ గా ఉండడం, రెండు, లీడర్ లని నమ్ముకోకుండా సొంత క్యాడర్ బిల్డ్ చేసుకోవడం, మూడు, మీడియా నుండి వ్యతిరేక కథనాలు లేకుండా చేసుకోగలగడం – ఈ మూడు విషయాల్లో కూడా ప్రజారాజ్యం కంటే జనసేన బెటర్ గా ఉంది అన్న ఈ విశ్లేషణ నేపథ్యంలో, మరి జనసేన కు ఎటువంటి ఫలితాలు వస్తాయి అన్నది తెలియాలంటే ఎన్నికలయ్యేదాకా వేచి చూడాలి.

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ పరువు తీసిన వైసీపీ సోషల్ మీడియా మీట్ !

వైసీపీ కోసం పని చేసిన , చేస్తున్న సోషల్ మీడియా వారియర్లు తమ పరిస్థితేమిటని గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో ఎవరూ పట్టించుకోలేదని ఫీలవుతున్నారు. ఈ క్రమంలో వారందరికీ భరోసా ఇప్పిస్తానంటూ సజ్జల పుత్రరత్నం...

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close