ఎన్నిచెప్పినా జనసేన – బీజేపీ నేతల ఆవేదనను సీరియస్‌గా తీసుకుంటారా..?

బీజేపీ హైకమాండ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ.. రాష్ట్రంలో మాత్రం.. ఆ పార్టీ నేతల్ని తరిమి తరిమికొడుతూండటం … రాష్ట్ర నాయకులను అసహనానికి గురి చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి. ఎన్నో కొన్ని స్థానాలు గెలుచుకుని ఉనికి చాటుకుందామంటే… వైసీపీ.. దాడులతో నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. మేనిఫెస్టోను ఆవిష్కరించే సమయంలో.. మేనిఫెస్టోలోని అంశాల కంటే.. తమపై జరుగుతున్న దాడుల గురించి అటు జనసేన చీఫ్.. ఇటు బీజేపీ ఏపీ చీఫ్.. మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో జనసేన, బీజేపీ నేతలపై జరిగిన దాడులు దారుణమని ఇద్దరు నేతలు మండిపడ్డారు. శేషన్ లాంటి ఎన్నికల అధికారి ఉంటే .. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కూడా ఆలోచించాలని.. దారుణాలు నియంత్రణ చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ అంశాలను గవర్నర్, కేంద్రం దృష్టి కి తీసుకెళతామని.. ఇప్పటికే బీహార్ ను మించి ఎపి లో హింస అనే చర్చ నడుస్తుందన్నారు.

ఏపీ బీజేపీ చీఫ్.. కన్నా లక్ష్మినారాయణ .. వైసీపీపై మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక ఆర్డినెన్స్ తెచ్చి అన్ని సీట్లు తీసుకుంటే పోయేదని..ఇప్పుడు.. వైసీపీ నేతల గూండాయిజానికి.. అరాచకానికి.. జగన్ నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడు చేసి.. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. టెండర్ పత్రాలు లాక్కెళ్లినట్లు .. నామినేషన్ పత్రాలు చించేస్తున్నారని.. ఎన్నికల సంఘానికి చెప్పినా ప్రయోజనం లేదని విమర్శించారు. పోలీసులే విత్ డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ జీవితం లో ఈ తరహా ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు. గూండాయిజానికి బ్రేక్ వేయాలంటే వైసిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలో… ఆయన తన పార్టీకి కూడా కట్టుబడి ఉండాలని కన్నా డిమాండ్ చేశారు.

ఓ వైపు వైసీపీ నత్వానీని రాజ్యసభకు పంపడంలో.. బీజేపీ ఆదేశం ఉందని.. బయట ప్రచారం జరుగుతోంది. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయని.. ఢిల్లీలోనూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో.. తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నా… ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడలేని నిస్సహాయ స్థితికి బీజేపీ – జనసేన పార్టీలు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల తీరుపై ఆవేదన చెందడమే తప్ప.. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నేతలుగా తమ పవర్ ను చూపించలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చేశారు..!

వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగిన రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా..ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదని ప్రకటించారు. ఎప్పటిలాగే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. పార్టీలోని కొంత మంది వ్యక్తులు కూడా...

ఎస్ఈసీ ఆర్డినెన్స్‌పై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ సర్కార్..!

ఎస్ఈసీ అర్హతలు మార్చుతూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కొనసాగుతున్నప్పటికీ...ఎస్ఎల్పీ దాఖలు...

శంకించొద్దు.. జగన్‌కు విధేయుడినే : విజయసాయిరెడ్డి 

తాను చనిపోయేవరకు జగన్‌కు, ఆయన కుటుంబానికి విధేయుడిగానే ఉంటానని.. నన్ను శంకించాల్సిన అవసరం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా ముఖంగా వెల్లడించారు. వైఎస్ జగన్ కు... అత్యంత ఆప్తునిగా పేరు తెచ్చుకున్న ఆయన...

అమిత్‌షాతో భేటీకి మంగళవారం ఢిల్లీకి జగన్..!?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు మీడియా ప్రతినిధులకు అనధికారిక సమాచారం అందింది. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారని.. కేంద్ర హోంమంత్రి అమిత్...

HOT NEWS

[X] Close
[X] Close