ఆస్తి పన్ను పెంపుపై బీజేపీ-జనసేన పోరాటం..!

ఆంధ్రప్రదేశ్  భారతీయ జనతా పార్టీ ఎలాంటి అంశాలపై పోరాడాలో నిర్ణయించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో సవాలక్ష సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పని వివాదాస్పదమే అవుతోంది. అయినప్పటికీ.. ఎక్కడా పెద్దగా యాక్టివ్‌నెస్ కనిపించడం లేదు. ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యంతో.. తాజాగా విజయవాడలో.. బీజేపీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. అందులో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కరుణాకరన్ కూడా వచ్చారు. మేధోమథనం జరిపి ఏం చేయాలన్నదానిపై చివరికి ఓ నిర్ణంయ తీసుకున్నారు. అేదమిటంటే… ఏపీ సర్కార్ చేస్తున్న పన్నుల పెంపుపై పోరాటం చేయడం. 

ఏపీలో ఆస్తి పన్నులను.. మార్కెట్ వాల్యూ ఆధారంగా నిర్ణయించాలని ఏపీ సర్కార్ నిర్ణయించడంతో …  పన్నులు భారీగా వడ్డించనున్నారు. ఈ కారణం..ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది. దీంతో.. ఈ అంశంగా… పోరాటాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జనసేనతో కలిసి ప్రజాఉద్యమాలు నిర్మిస్తామని ఎమ్మెల్సీ మాధవ్ లాంటి వారు చెబుతున్నారు. అయితే.. మరీ ఇంత అమాయకంగా ఏపీ బీజేపీ రాజకీయాలు చేస్తోందన్న అన్న ప్రశ్న ఇక్కడే వస్తోంది. ఏపీ సర్కార్ పన్నుల పెంపు అనేది.. సొంత నిర్ణయం కాదు. ఏపీ సర్కార్‌కు అప్పుల ఆశ చూపి… పట్టణ సంస్కరణలు అమలు చేసేలా చేసింది బీజేపీ. 

ఈ విషయంపై గతంలోనూ చర్చ జరిగింది. అప్పుల కోసం ప్రజలపై భారం వేసేందుకు జగన్ వెనుకాడటం లేదని విమర్శలు వచ్చాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్ష్లకు కూడా.. మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. ఇది కూడా కేంద్రం పుణ్యమే. అప్పుల కోసం సంస్కరణలు అమలు చేయాలని అనుకుంటున్నారు. తమ నిర్వాకంతో… పెరుగుతున్న ఆస్తి ప న్నుల గురించి బీజేపీనే.. పోరాడాలని నిర్ణియంచుకోవడం ఇక్కడ కొసమెరుపు. ప్రజల్ని మరీ ఏమీ తెలియని వాళ్లుగా భావించడం వల్లనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఇతరు పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close