తానా కి ముఖ్య అతిధి గా జనసేన అధ్యక్యుడు శ్రీ పవన్ కళ్యాణ్

తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (తానా) మహాసభలు ఈ సరి వాషింగ్టన్ డీసీ లో వాల్తేర్ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జులై 4-6 జరగబోతున్నాయి. ప్రతి 2 య్యేళ్లు కి జరగబోయే ఈ మహాసభలు కి ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారు హాజరవుతున్నారు. తానా అధ్యక్యుడు సతీష్ వేమన (TANA President Satish Vemana) ఈ మహాసభలు విజయవంతం అవడానికి ఎంతో కృషి చేస్తున్నారు.

తానా సభలకు (Telugu Association of North America conference committee) విశిష్ట అతిధిగా పవన్ కళ్యాణ్ గారిని, అధ్యక్షుడు సతీష్ వేమన గారు సాదరంగా ఆహ్వానించడం జరిగింది.

ఆ చూపులో పవర్..ప్రతి సినిమాలో పవర్..ప్రతి మాటలో పవర్..మనుషుల్ని కదిపి, కుదిపి ఆలోచింపచేసే దేశభక్తుడి పవర్..ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న వేలు పెట్టుకుని సినీ ఇండస్ట్రీకి వచ్చారు. అదే అన్నయ్య గర్వపడేంత పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

పవన్ కనిపిస్తే చాలు ప్రేక్షకులు వెర్రెక్కిపోతారు. పవనిజంతో ఊగిపోతారు. ఆయన సిమ్మా కోసం ఏళ్లపాటు ఎదురుచూస్తారు. పవన్ సినిమా స్థాయిని పెంచిన హీరో. ఆయన సినిమాల్లో మహిళలకు గౌరవం ఉంటుంది. తమ్ముడు, జానీ , ఖుషీ, జల్సా, అన్నవరం , అత్తారింటికి దారేది, కాటమ రాయుడు ఇలా ప్రతి సినిమాలో మహిళలపై దాడులు చేస్తే సహించనన్న సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు. అమ్మాయిల జోలికొస్తే నరాలు దారాలవుతాయని హెచ్చరిస్తూనే ఉన్నారు. అందుకే పవన్ కి మేల్ ఫాన్స్ ఎంత మందో ఫిమేల్ ఫాన్స్ కూడా అంతే మంది ఉంటారు.

తెలుగునాట చాలా హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రమే భక్తులు ఉంటారు. పవన్ ను దేవుడిలా ఆరాధిస్తారు.సినిమాకు సామాజిక స్పృహను జోడించారు పవన్ కళ్యాణ్.

అలానే నీతి మాలిన రాజకీయాల్లో విలువలను నిలబెట్టడానికి జనసేన స్థాపించారు పవన్ కళ్యాణ్. ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకై నిలబడ్డారు. ఒక్క అడుగుతో ప్రయాణం మొదలైంది. లక్షలాది జన సైనికులను కదిలించింది. భవిష్యత్తులో సరికొత్త రాజకీయ సునామీ ఖాయమని వారి కళ్ళలో కాన్ఫిడెన్స్ చెబుతొంది. వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. లక్ష్యం మాత్రమే కాదు, నడిచే మార్గం కూడా గొప్పదై ఉండాలన్న మహాత్ముని సందేశాన్ని మనసులో నింపుకొని ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్.

ఆయన ప్రతి అడుగు విజయవంతం కావాలని తానా కోరుకుంటోంది. తానా మహా సభలకి విశిష్ట అతిధిగా విచ్చేసిన జన జనానికి శుభ స్వాగతం పలుకుతొంది (Pawan Kalyan attending the TANA conference).

ఇతర వివరాలకు తానా కాన్ఫరెన్స్‌ వెబ్‌సైట్‌ను www.TANA2019.org చూడండి.

Press release by: Indian Clicks, LLC

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close