జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పార్టీని నడిపేందుకు నిధుల కోసం.. ప్రవాసాంధ్రుల సాయం కోరబోతున్నారు. ఈ నెల రెండో వారంలో ఆయన అమెరికాకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న జనసేన సానుభూతి పరుల వద్ద నుంచి పార్టీ కోసం.. కనీసం రూ. 75 కోట్లు ఫండ్‌గా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి అమెరికాలో సౌండ్ పార్టీలుగా ఉన్నా… జనసేనకు సానుభూతి పరుగా ఉంటారని భావిస్తున్న వారికి ఆహ్వానాలు పంపుతున్నారు. డల్లాస్, సియాటిల్ నగరాల్లో.. పవన్ కల్యాణ్.. ప్రవాసాంధ్రులతో సమావేశాలు జరపనున్నారు. ఇప్పటికే… ఎన్నైరైలను.. సమావేశానికి వచ్చేలా చేయడానికి… ముత్తంశెట్టి కృష్ణారావు, అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ అమెరికాకు వచ్చి… కార్యక్రమాలను సమన్వయం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో.. పవన్ కల్యాణ్‌కు నిధుల అవసరం పడింది. కార్యకర్తలు కొంత మంది నెలకు రూ. వంద చొప్పున విరాళాలు ఇస్తున్నా.. లైక్ మైండెడ్ పీపుల్‌తో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి .. విరాళాలు తీసుకుంటున్నా.. పార్టీ నిర్వహణకు.. కార్యక్రమాల ఏర్పాట్లకు సరిపోవడం లేదు. అందుకే ఎన్నికలకు ముందు …పార్టీ నిర్వహణ కోసం కచ్చితంగా భారీ మొత్తం అవసరం కాబట్టి… ఆ మొత్తాన్ని ఎన్నారైల నుంచి సేకరించాలనే ఆలోచన చేశారు. ఈ మేరకే .. ఫండ్ రైజింగ్ మీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే అమెరికాలో.. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఎన్నారైలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఈ విషయంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే.. కాస్త ముందంజలో ఉంటుంది. ఆ పార్టీకి చెందిన కొంత మంది సానుభూతి పరులు .. యాక్టివ్‌గా ఉంటూ విరాళాలు సేకరిస్తూ ఉంటారు. మరే పార్టీకి.. పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చిన సందర్భాలు లేవు. గతంలో వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు.. ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవికి కూడా.. పెద్దగా స్పందన రాలేదు. సన్నిహితులు, మిత్రులు మాత్రమే పార్టీకి ఫండ్ ఇచ్చారు.. ఇతర ఎన్నారైలు ఇవ్వలేదు. కానీ ఈ సారి మాత్రం.. పవన్ కల్యాణ్.. ఎన్నారైలు తనకు అండగా ఉంటారని అనుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్‌కి ఎలాంటి టిక్కెట్లు ఏర్పాటు చేయడం లేదని.. నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఎన్నారైలందర్ని వివిధ మార్గాల ద్వారా అన్వేషిస్తున్నారు. ఇండియాలో పవన్ కల్యాణ్ మీటింగ్‌కు పెట్టినట్లు… టిక్కెట్లు పెడితే.. కొద్ది మంది కూడా రాకపోతే ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో టిక్కెట్లు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఎంట్రీ ఫ్రీ కావడంతో.. పెద్ద సంఖ్యలో ఎన్నారైలు వస్తారని.. ఈ టూర్‌ని కోఆర్డినేట్ చేయబోతున్న వారు ఆశిస్తున్నారు. అయితే వచ్చే వారిలో ఎంత మంది జనసేనకు నిధులు ఇస్తారన్నది మాత్రం..అంచనా వేయలేం..!