కోనసీమ జిల్లాలో దిష్టి గురించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో జరుగుతున్న రాజకీయంపై జనసేన పార్టీ స్పందించింది. రెండు రాష్ట్రాల మద్య సుహృద్భావ వాతావరణం ఉందని.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని రెండు లైన్ల ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది.
గత వారంలో చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా కొంత మంది మంత్రులు ఘాటుగా స్పందించడం ప్రారంభించారు.సినిమాలు ఆపేస్తామని.. తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని మాట్లాడటం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఇలా మట్లాడుతూండటంతో ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో దీనికి తెరదించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. మాటల్ని వక్రీకరించవద్దని ప్రకటన జారీ చేశారు.
పవన్ కల్యాణ్ రాష్ట్ర విభజన అంశాలు..కోనసీమ లింక్ పై రైతులతో స్పందిస్తూ దిష్టి తగిలిందని వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఈ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ హఠాత్తుగా ఏదో రాజకీయం కోసం అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు స్పందించడంతో.. రాజకీయం ప్రారంభమయిందని జనసేన పార్టీకి క్లారిటీ వచ్చింది.అందుకే వెంటనే .. వక్రీకరించవద్దని వివరణ ఇచ్చారు.
