పార్టీ ఫిరాయింపు సాక్ష్యం ఇచ్చిన రాపాక ! ఇక స్పీకర్‌దే నిర్ణయం !

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తాను పార్టీ మారినట్లుగా అధికారికంగా తెలియ చేశారు. వైసీపీ దీక్షలో పాల్గొని వైసీపీ జెండా కప్పుకుని తాను అచ్చమైన వైసీపీ నేతగా.. ఇతర పార్టీల నేతలపై బూతులు వినిపించారు. గురువారం తన నియోజకవర్గం రాజోలులో వైసీపీ సలహాదారుడు సజ్జల పిలుపునిచ్చిన నిరనస దీక్షలను తన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాపాక చాలా రోజుల నుంచి జనసేనను విమర్శిస్తూ.. వైసీపీకి అనుబంధంగా ఉంటున్నారు.

గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోమని ప్రకటించిన వైసీపీ ఇలా నేతల్ని ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారు కానీ పార్టీలో చేర్చుకోవడం లేదు. అలా చేరిన మరుక్షణం అనర్హతా వేటు వేస్తామని అటు జగన్‌తో పాటు ఇటు స్పీకర్ కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పార్టీలో అధికారికంగా చేర్చుకోలేదు కాబట్టే అనర్హతా వేటు వేయలేదంటున్నారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ఓటింగ్ జరిగితే ఆయన వాకౌట్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడూ పార్టీ ఫిరాయింపు సాక్ష్యాలు ఇవ్వలేదు.

ఇప్పుడు అత్యాత్సాహంతో పార్టీ కండువా కప్పుకుని మరీ నిరసనలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. సీఎం , స్పీకర్ ప్రవచించిన విలువల్ని ఇప్పుడైనా పాటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా వైసీపీ కండువాతో ఉండకూడదని సభకు వచ్చిన వాళ్లుచెప్పడంతో తర్వాత తీసేశారు. కానీ అప్పటికీ దృశ్యాలు సోషల్ మీడియాలోకి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close