శుభారంభం సగం విజయంతో సమానం. చిత్రసీమ ఈ మాటని బలంగా నమ్ముతుంది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్పట్టేస్తే ఇక ఆ సినిమాకి తిరుగుండదు. పబ్లిసిటీ పెంచి, సినిమాకి విపరీతమైన హైప్ తెచ్చేది కూడా ఫస్డ్ డే కలక్షన్ల కోసమే. పెద్ద హీరోల సినిమాలైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాక్ ఏంటో తెలిసేలోపలే కోట్లు వచ్చిపడిపోతుంటాయి. ఫస్ట్ డే ఎంతొచ్చింది అనే విషయంపైనే సినిమా జయాపజయాల్ని లెక్కేయొచ్చు. అందుకే ఫస్ట్ డే వసూళ్లు కీలకమైపోయాయి. ఇప్పుడు జనతా గ్యారేజ్ తొలి రోజు ఎంత వసూలు చేస్తుంది? అనే అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాకి ఇంత హైప్ వచ్చింది లేదు. ఎక్కడ చూసినా జనతా గ్యారేజ్ ముచ్చట్లే. సెన్సార్ టాక్ కూడా పాజిటీవ్‌గా రావడంతో ఈ సినిమాపై ఆశలు, అంచనాలూ పెరిగిపోయాయి. తొలిరోజు వసూళ్లలో జనతా గత రికార్డులు బ్రేక్ చేయబోతోందంటూ అభిమానులు అప్పుడే కాలర్ ఎగరేస్తున్నారు. 31వ తేదీ అర్థ రాత్రి నుంచి జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. ఓవర్సీస్లో సరే సరి. కేరళలో తొలిసారి ఎన్టీఆర్‌కి భారీ ఓపెనింగ్ లభించబోతోంది. మొత్తమ్మీద చూస్తే తొలి రోజు కనీసం రూ.20 కోట్ల వరకూ వసూళ్లు సాధించవొచ్చని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి.
శుక్ర వారం కాస్త డ్రాప్ అయినా.. శని, ఆదిల్లో మళ్లీ పుంజుకోవొచ్చని ఈ నాలుగు రోజుల్లో రూ.50 కోట్లు తెచ్చుకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదని, అయితే అది టాక్ని బట్టి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు మాత్రం ఎంత కాదన్నా.. రూ.20 కోట్లు సాధించడం ఖాయమని, ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే రికార్డు అవుతుందన్నది వాళ్ల అభిప్రాయం. తొలి రోజే రూ.20 కోట్లు వచ్చాయంటే… మిగిలింది రాబట్టుకోవడం ఎంత సేపు?? సో.. నిర్మాతలూ, బయ్యర్లూ హ్యపీగా ఉండొచ్చన్నమాట.