జాతిర‌త్నాలు ట్రైల‌ర్‌: ‘ఫ‌న్‌’టాస్టిక్‌

న‌వీన్ పొలిశెట్టి… ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌తో.. త‌న కామెడీ టైమింగ్ ఏమిటో రుచి చూపించాడు. ఇప్పుడు `జాతి ర‌త్నాలు`తో… మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని ఫ‌న్ రైడ్ కి తీసుకెళ్ల‌బోతున్నాడు. ఈసారి న‌వీన్‌కు ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ తోడుగా నిలిచారు. అనుదీప్ ద‌ర్శ‌కుడు. నాగ అశ్విన్ నిర్మాత‌గా వ్య‌వ‌హిస్తున్నారు. ఈనెల 11న సినిమా విడుద‌ల అవుతోంది. ఈరోజు ప్ర‌భాస్ చేతుల మీదుగా ట్రైల‌ర్ ఆవిష్క‌రించారు.

2 నిమిషాల నిడివిగ‌ల ట్రైల‌ర్ ఇది. రెండు నిమిషాలూ… నాన్ స్టాప్ ఫ‌న్ రైడ్ సాగింది. ముఖ్యంగా న‌వీన్ కామెడీ టైమింగ్ కిరాక్ పుట్టించింద‌నే చెప్పాలి.
టెన్త్‌లో సిక్ట్సీ ప‌ర్సెంట్
ఇంట‌ర్ లో50 ప‌ర్సెంట్
బీటెక్ లో 40 ప‌ర్సెంట్‌.. ఏందిరా ఇది – అని అడిగితే సిగ్గు ప‌డ‌కుండా `అందుకే ఎంటెక్ చేయ‌లేదు` అని చెప్ప‌డం సూప‌ర్ కామెడీ సెన్స్‌. లేడీస్‌ ఎంపోరియ‌మ్‌ని.. లేడీస్ ఎంప‌వ‌ర్ మెంట్ గా మార్చేసే టెక్నిక్ కూడా ట్రైల‌ర్‌లోనే తెలిసిపోయింది. పోలీస్ స్టేష‌న్‌కి వ‌చ్చి.. అవుటాఫ్ స్టేష‌న్ అని క‌వ‌ర్ చేసుకోవ‌డం ఇంకొచెం ఫ‌న్సీ. మొత్తానికి ప్ర‌తీ పాత్రా… ప్ర‌తీ డైలాగ్ కామెడీ ట‌చ్‌తోనే సాగింది. రెండు నిమిషాల్లోనే ఇంత కామెడీ పుట్టించారంటే.. రెండు గంట‌ల్లో ఆ కామెడీ వంద రెట్లు క‌నిపించ‌డం ఖాయం. మొత్తానికి సినిమా చూడాల‌న్న ఉత్సుక‌త‌ని మ‌రింత‌గా పెంచింది.. ఈ జాతిర‌త్నాలు ట్రైల‌ర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లాలూకు బెయిల్..! ఇక బీహార్‌లో కిస్సాకుర్సీకా..!?

జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...

గోగినేనితో ఆడుకుంటున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌

బాబు గోగినేని.. ఈ పేరు నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌య‌మే. ప్ర‌జ‌ల్ని చైత‌న్య ప‌రిచే వివిధ కార్య‌క్ర‌మాల్ని చేస్తుంటారాయ‌న‌. చ‌ర్చ‌ల్లోనూ పాల్గొంటారు. లాజిక‌ల్ గా.. ఆయ‌న్ని కొట్టేవారే ఉండ‌రు. బిగ్ బాస్ లోనూ అడుగుపెట్టారు. అయితే.....

‘నార‌ప్ప’ కంటే ముందు ‘దృశ్య‌మ్ 2’?

మేలో 'నారప్ప‌' విడుద‌ల కావాల్సివుంది. ఇది వ‌ర‌కే డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ప్ర‌స్తుతం `నార‌ప్ప‌` రావ‌డం క‌ష్ట‌మే. నార‌ప్ప కోసం మ‌రో మంచి డేట్ వెదికే ప‌నిలో ఉన్నారు సురేష్...

మెగా హీరో బాధ్య‌త‌లు తీసుకున్న సుకుమార్‌

రంగ‌స్థ‌లం నుంచీ మైత్రీ మూవీస్‌కీ, సుకుమార్ కీ మ‌ధ్య అనుబంధం మొద‌లైంది. ఆ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో... ఈ బంధం బ‌ల‌ప‌డింది. అప్ప‌టి నుంచీ మైత్రీ నుంచి వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ...

HOT NEWS

[X] Close
[X] Close